Home రాజకీయాలు అదీ సంగతి.. కోడెల కథ బట్టబయలైంది..!

అదీ సంగతి.. కోడెల కథ బట్టబయలైంది..!

SHARE

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్ద తనపై దాడి జరిగిందంటున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలకు సంబంధించిన అసలు వీడియోలు బయటకు వచ్చాయి. ఆ రోజు ఆ పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటన ఏమిటనే అంశంపై అసలు కథ వెలుగులోకి వచ్చింది. కోడెల చెబుతున్న మాటల్లో నిజమెంతో.. ఆ ఫొటోలను, వీడియోలను బట్టి నిర్ధారించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది.

ఆ ఫొటోలను బట్టి చూసినా, వీడియోలను చూసినా కోడెల దౌర్జన్యంగా ప్రవర్తించారనే క్లారిటీ వస్తోందని పరిశీలకులు అంటున్నారు.

కోడెల శివప్రసాద్ చెప్పుకుంటున్నట్టుగా ఆయనపై అక్కడ ఎవ్వరూ దాడి చేయలేదు. ఆయనే పోలింగ్ బూత్ లోకి ప్రవేశించారు. అంతటితో ఆగలేదు కూడా. అక్కడ ఏజెంట్ల మీద, ఓటర్ల మీద ఆయన దౌర్జన్యానికి దిగారు.

పోలింగ్ బూత్ తలుపులు వేయించి చాలా సేపు అక్కడే ఉండిపోయారు. దీంతో ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. అభ్యర్థిగా ఆయన పోలింగ్ బూత్ లోకి ప్రవేశించవచ్చు. అయితే.. అలా తలుపులు వేసుకోవడం, ఏజెంట్లను, ఓటర్లను బెదిరించడం మాత్రం కచ్చితంగా నేరమే. అందుకు సంబంధించి ఇప్పుడు వీడియోలు బయటకు వచ్చాయి.

ఇక కోడెల వ్యవహరించిన తీరుతో అక్కడి ప్రజలు ఆగ్రహోద్రిక్తులు అయ్యారు. ఆయన బయటకు రాగానే ఆయన వాహనాన్ని వెంటారు. అప్పటికే కోడెల పోలింగ్ బూత్ లో చొక్కాను చించుకుని, తనపై దాడి జరిగిదంటూ మరో డ్రామాకు తెరలేపినట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ కోడెల శివప్రసాద్ రావు ఇనిమెట్లలో నడిపించిన అసలు కథ అని అంటున్నారు.