Home సినిమా రష్మిక ఇమేజ్ ను అలా వాడుకుంటున్నారు!

రష్మిక ఇమేజ్ ను అలా వాడుకుంటున్నారు!

SHARE

తెలుగులో సంచలన విజయాలను సొంతం చేసుకున్న తార రష్మిక మందన. ‘గీతగోవిందం’తో ఈమె ఏ స్థాయి స్టార్ అయ్యిందో అందరికీ తెలిసందే. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో చేతినిండా అవకాశాలను సంపాదించుకుంది. అంతకు ముందు ‘ఛలో’ అంటూ చేసిన సినిమాతో పోలిస్తే ‘గీతగోవిందం’తో రష్మికు బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది.

ఇక ఆ తర్వాత అప్పటికే అయిన ఎంగేజ్ మెంట్ ను సైతం పక్కన పెట్టి రష్మిక సినిమాలకే అంకింతం అయ్యింది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు ఏవీ అంతగా హిట్ కాకపోయినా.. ప్రస్తుతానికి అయితే చేతినిండా అవకాశాలున్నాయి.

‘డియర్ కామ్రేడ్’ పై భారీ అంచనాలున్నాయి. ఇలా దూసుకుపోతున్న రష్మిక ఇమేజ్ ను ఇండస్ట్రీలోని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. అది అనువాద సినిమాలతో.

తెలుగులో హీరోయిన్ గా నటించకముందే కన్నడలో మంచి గుర్తింపును కలిగి ఉండి, కొన్ని సినిమాలు చేసింది రష్మిక. ఇప్పుడు అలాంటి సినిమాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. రష్మిక నటించిన సినిమాలుగా వాటిని డబ్ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి ‘ఛలో-గీత’ గా విడుదల కాబోతోంది.

అయితే ఇదేమీ ఇండస్ట్రీలో కొత్త కాదు. పక్క భాషల్లో గుర్తింపును కలిగి ఉన్న వారందరి విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రష్మిక విషయంలో జరుగుతూ ఉంది. ఇలాంటి ట్రిక్స్ సదరు తారలను కొంత ఇబ్బంది పెడతాయి కూడా!