Home రాజకీయాలు పోలింగ్ తర్వాత.. పవన్ కల్యాణ్, లోకేష్ మిస్సింగ్!

పోలింగ్ తర్వాత.. పవన్ కల్యాణ్, లోకేష్ మిస్సింగ్!

SHARE

రాజకీయం అంటే అదేదో సీజనల్ గా చేసేది అనే లెక్క పవన్ కల్యాణ్ ది. సినిమాలు లేని సమయంలో, ఎన్నికలు దగ్గర పడిన సందర్భాల్లో పవన్ కల్యాణ్ కురాజకీయం గుర్తుకు వస్తుంది. కాసేపు ఊగిపోయే ప్రసంగాలు చేస్తారు. ఎన్నికల సందర్భంలో వచ్చి హడావుడి చేస్తూ ఉంటారు.

గత ఐదేళ్లలో పవన్ కల్యాణ్ తీరును అలా గమనించారు ప్రజలంతా. ఇక ఈ సారి ఎన్నికల్లో పోటీ కి దిగిన, తన పార్టీని పోటీలో పెట్టి, తను కూడా పోటీ చేసినా పవన్ కల్యాణ్ తీరు మాత్రం ఏమీ మారినట్టుగా లేదు. పోలింగ్ అలా పూర్తి అయ్యిందో లేదో .. పవన్ కల్యాణ్ అప్పుడే కనపడకుండా పోయారు!

పోలింగ్ తర్వాత పవన్ కల్యాణ్ స్పందించింది లేదు, పోలింగ్ జరిగిన తీరుపై మాట్లాడింది లేదు. ఓటేసి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకుని ఆయన సేదతీరుతున్నారట. మొన్నటి వరకూ హైదరాబాద్ లో సీమాంధ్రుల మీద దాడులు జరిగాయని ప్రచారం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ కే చేరుకోవడం విడ్డూరం.

ఇక పోలింగ్ తర్వాత రకరకాల అంశాల గురించి రాద్ధాంతం జరుగుతూ ఉంది. ఈవీఎంల పని తీరుపై రచ్చ సాగుతూ ఉంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఆ అంశాల గురించి కూడా స్పందిచడంలేదు. తన పని అయిపోయిందని.. ఇక తన ఎంజాయ్ మెంట్ తనది అన్నట్టుగా పవన్ మాయమయ్యాడు.

ఇక పోలింగ్ తర్వాత జనాలకు కనపడకుండా పోయింది కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే కాదు, నారా లోకేష్ కూడా. ఈయన కూడా పోలింగ్ తర్వాత అడ్రస్ లేడు. మీడియాతో మాట్లాడింది లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు రోజూ ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తుంటే.. లోకేష్ మాత్రం ఎవరికీ కనపడకుండా పోయారు.

లోకేష్ టెన్షన్ అంతా ఇప్పుడు మంగళగిరి విషయంలోనే ఉందని, అక్కడ తను గెలవడమా, ఓడటమా అనే అంశం గురించి లోకేష్ టెన్షన్ పడుతూ ఉన్నారని.. అందుకే ఆయన బయటకు కూడా రావడం లేదని అనుకుంటున్నారు జర్నలిస్టిక్ సర్కిల్స్ లో!