Home సినిమా ఇన్ స్టాగ్రమ్ లో ప్రభాస్ క్రేజ్ ఏమిటో చూశారా!

ఇన్ స్టాగ్రమ్ లో ప్రభాస్ క్రేజ్ ఏమిటో చూశారా!

SHARE

ఇప్పటి వరకూ ఒక్క పోస్టు చేయలేదు. ఒక్క ఫొటోను పెట్టలేదు. కనీసం ప్రొఫైల్ పిక్ కూడా సెట్ చేయలేదు. ఇన్ స్టాగ్రమ్ లోకి అలా ఎంట్రీ ఇచ్చాడో లేదో..ప్రభాస్ కు ఫాలోయర్లు భారీగా నమోదయ్యారు. ఇన్ స్టాగ్రమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సేపట్లోనే ప్రభాస్ కు ఏకంగా ఏడు వందల అరవై వేల మంది ఫాలోయర్లు ఏర్పడటం విశేషం.

ప్రభాస్ అధికారికంగా ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ ను తెరిచినట్టుగా ఒక ప్రెస్ నోట్ ను ఇచ్చారు. అది మాత్రమే జరిగింది. నెటిజన్లు ఆ విషయాన్ని తెలుసుకుని ప్రభాస్ అకౌంట్ ను ఫాలో కావడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే ప్రభాస్ ఫాలోయింగ్ ఏడు లక్షలను మించి పోయింది.

ఒకవేళ ప్రభాస్ అందులో ఏదైనా పోస్టు పెట్టి ఉంటే ఈ క్రేజ్ వచ్చిందన్నా ఒక రకం.అయితే ప్రభాస్ ఎలాంటి పిక్ పోస్టు చేయకపోయినా.. ఆయన క్రేజ్ అయితే భారీగా ఫాలోయర్లను తెచ్చి పెట్టింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఈ ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ కు ఇంకా అఫిషియల్ గా బ్లూ టిక్ మార్క్ కూడా రాలేదు.కానీ ఇంతలోనే ఈ స్థాయిలో ఫాలోయర్లు తయారయ్యారు.

ఇదీ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం. మరి ఇంకా పోస్టులు పెట్టకుండానే, ఫొటో కూడా పోస్టు చేయకుండానే ఈ హీరోకి ఈ స్థాయి ఫాలోయింగ్ అంటే.. ఈ ఖాతా ద్వారా ప్రభాస్ యాక్టివ్ గా ఉంటే ఫాలోయర్ల సంఖ్య ఏ రేంజ్ కు చేరుతుందో!