Home రాజకీయాలు వారంతా చిత్తే.. ఆదినారాయణ రెడ్డికి డిపాజిట్ కూడా కష్టమా?

వారంతా చిత్తే.. ఆదినారాయణ రెడ్డికి డిపాజిట్ కూడా కష్టమా?

SHARE

-ఏపీలో ముగిసిన పోలింగ్ ప్రక్రియ ప్రకారం.. కొంతంది ప్రముఖ నేతలు చిత్తుగా ఓడతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అధికార పార్టీ తరఫున ప్రముఖ నేతలకు ఓటమితప్పదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

-ముందుగా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బాబుకు ఓటమి తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజయం సాధించడం దాదాపు ఖాయమనే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

-ఇక బాబు కేబినెట్లో చాలా మంది మంత్రులకు ఓటమి తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్సీ మంత్రులు కూడా పోటీ చేశారు. వారికి కూడా ఓటమి ఖాయమని అంటున్నారు.

-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి ఈ సారి కూడా గెలుపు ముచ్చట తీరదని అంటున్నారు.

-ఇక ఫిరాయింపు మంత్రుల్లో అఖిలప్రియకు ఓటమి తప్పదని అంచనా. ఆళ్లగడ్డలో అఖిల ఓటమి ఖరారే అంటున్నారు. మరో ఫిరాయింపు మంత్రి అమర్ నాథ్ రెడ్డి పరిస్థితి కూడా కాస్త అటూ ఇటూ అలానే ఉందని అంటున్నారు.

-ఇక మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో అనుకూల పరిస్థితి లేకపోవడంతోనే అచ్చెన్నాయుడు అసహనం వెల్లగక్కుతున్నారని పరిశీలకులు అంటున్నారు.

-ఎంపీలుగా పోటీ చేసిన మంత్రుల్లో శిద్ధా రాఘవరావుకు విజయం అసాధ్యం అని, ఒంగోలు ఎంపీగా మాగుంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధిస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

-ఇక కడప ఎంపీగా బరిలోకి దిగిన ఆదినారాయణ రెడ్డికి అయితే కనీసం డిపాజిట్ కూడా కష్టమే అని అంటున్నారు. ఆదిని కడప జనాలు చిత్తుగా ఓడించేశారని, మే ఇరవై మూడున ఆ విషయం పూర్తిగా అర్థం అవుతుందని పరిశీలకులు అంటున్నారు.