Home ప్రత్యేకం జాతీయ రాజకీయంలో జగన్ కీలక పాత్ర..అప్పుడే ఫోన్లు!

జాతీయ రాజకీయంలో జగన్ కీలక పాత్ర..అప్పుడే ఫోన్లు!

SHARE

-ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయాన్ని సాధించబోతోందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరవైకి పైగా ఎంపీ సీట్లను సాధించవచ్చని అంచనాలున్నాయి.

-అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరిగిన ఏపీలో రెండు ఎన్నికల విషయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుందని అంటున్నారు.

-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూటా ఇరవైకి పైగా ఎమ్మెల్యే సీట్లను నెగ్గవచ్చని అంచనా.

-ఇక ఎంపీ సీట్ల విషయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు అని, ఇరవై వరకూ ఎంపీ సీట్ల వరకూ లభిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

-ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుత రాజకీయంలో ఇరవై మంది ఎంపీల బలం అంటే అది చిన్న విషయం ఏమీ కాదు.

-కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనపడటం లేదు. దీంతో.. ఇరవై ఎంపీ సీట్లను నెగ్గే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కేంద్రంలో కీలకం అయ్యే అవకాశాలున్నాయి.

-ఇప్పటికే ఈ విషయాన్ని గ్రహించి జగన్ తో కొందరు నేతలు సంప్రదింపుల జరుపుతూ ఉన్నారని, మొన్నామధ్య ఏపీకి వచ్చి చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేసిన మమతా బెనర్జీనే జగన్ కు ఫోన్ చేశారని, ఆమె అప్పుడే జగన్ తో టచ్లో ఉంటున్నారని వార్తలు వస్తూ ఉండటం గమనార్హం.

-ఓవరాల్ గా అటు రాష్ట్ర రాజకీయంలోనూ, ఇటు కేంద్ర రాజకీయంలోనూ కీలక పాత్ర పోషించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.