Home రాజకీయాలు చంద్రబాబు మండ్య ప్రచారంపై భారీ విమర్శలు

చంద్రబాబు మండ్య ప్రచారంపై భారీ విమర్శలు

SHARE

-సాయం కోరిన ఆడబిడ్డతో రాజకీయ ఏంది?
– సోషల్‌ మీడియా వేదికగా అవాకులు.. చవాకులు

ఇటీవల భర్తను కోల్పోయిన అలనాటి తెలుగు నటి సుమలత అనివార్య కారణాల రీత్యా రాజకీయ అరంగేట్రం చేసింది. ప్రతి ఒక్క అభిమాని సాయం కోరుతోంది. ఈక్రమంలో కన్నడ నాట ఎందరో అభిమానులు, సినీనటులు సుమలత తరఫున ప్రచారం చేస్తున్నారు. కన్నడ హీరోలు దర్శన్, యశ్‌లతో పలువురు సినీ ప్రముఖులు వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా కర్ణాటకలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి సుమలతపై సానుభూతి వ్యక్తం అవుతోంది. ఇలాంటి తరుణంలో ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు సుమలతకు వ్యతిరేకంగా ప్రచారానికి రావడం ఏంటని కర్ణాటక వ్యాప్తంగా తెలుగు వారి నుంచి విమర్శలు వస్తున్నాయి. మండ్య లోక్‌సభ స్వతంత్య్ర అభ్యర్థి సుమలతకు మద్దతు ఇవ్వాల్సింది పోయి.. వ్యతిరేక ప్రచారం చేయడమేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని విమర్శిస్తున్నారు.

ఏ పార్టీకి మద్దతు కాదు..
చంద్రబాబు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ విలువలు ఉన్న వ్యక్తి అయితే ఇతర పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకూడదు. అయితే సుమలత బరిలో దిగింది స్వతంత్య్ర అభ్యర్థిగా కదా. అలాంటి సుమలతను కాదని.. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌పై పోరాటం చేసిన టీడీపీ అధినేత.. కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన జేడీఎస్‌ అభ్యర్థి తరఫున.. తెలుగు ఆడపడుచుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబు నెటిజర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

– ఆంధ్రప్రదేశ్‌ ఆడపడుచుకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు.
– ఆంధ్రుల మీద పోరాడుతున్నాడా ? ఆంధ్రుల కోసం పోరాడుతున్నాడు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా ?
– ఆంధ్రులకు అండగా నిలబడాల్సిన చంద్రబాబు ఎందుకు ఆలమట్టి పేరుతో మనకి మట్టి కొట్టిన దేవెగౌడ కి అండగా ఉంటున్నారు.
– ఏమిరా తమ్ముళ్ళు … మీ బాబు గారికి సిగ్గు ఉందా ?
– మండ్య అభ్యర్థి సుమలతను ఓడించాలని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.
– సుమలత ఆంధ్ర ప్రదేశ్‌ కి చెందిన ఆడపడుచు. గుంటూరు లో పుట్టిన ఆమెకు అండగా ఉండకుండా ఓడించే యత్నమేనా నీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం.
– గుంటూరు లో పుట్టి సినీరంగంలో రాణించిన తెలుగింటి ఆడపడుచు.
– ఆమె భర్త తన చివరి గడియల వరకు ఇప్పుడు మీ బాబు గారు మెచ్చుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ఆమెకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతేనే ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
– ఆలోచించండి.. చంద్రబాబు చేసేది కేవలం స్వార్థ రాజకీయాలే….ఆంధ్రుల మేలు చంద్రబాబు ఎప్పుడూ కోరుకోరు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ ద్రోహి.
– చంద్రబాబు తెలుగు వాడు అయి ఉండీ.. తెలుగు ఆడపడుచును ఓడించాలని అనుకోవడం తెలుగు జాతికే అవమానం.
– ఇతర రాష్ట్రంలో మన తెలుగు మహిళను ఆదర్శంగా తీసుకుంటుంటే చంద్రబాబు మాత్రం తెలుగు మహిళను ఓడించాలని పిలుపునివ్వడం తెలుగు ఆడపడుచులను కించపరచడమే అవుతుంది.
– ఆడపడుచు ఎదగడం మన తెలుగువారి గౌరవంగా భావించడం ఒక నాయకుడి లక్షణం. కానీ అదే ఆడతల్లిని(సుమలతను) తన రాజకీయ స్వార్థంకోసం ఓడించండి అని పిలుపునిచ్చేందుకు వస్తున్న బాబు నీచ క్రియలను తెలుగు వారందరం తీవ్రంగా ఖండిస్తున్నాం.