Home రాజకీయాలు ఓటమి ఖాయం.. రాష్ట్రం దాటేస్తున్న బాబు మనుషులు?

ఓటమి ఖాయం.. రాష్ట్రం దాటేస్తున్న బాబు మనుషులు?

SHARE

గత ఐదేళ్లుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత అనుకూలంగా పని చేశారనే వారు ఒక్కొక్కరుగా రాష్ట్రం దాటుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తనను కేంద్ర సర్వీసులకు తీసుకోవాలని దరఖాస్తు పెట్టుకోవడం విశేష పరిణామంగా చెప్పవచ్చు. ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఓటమి తప్పదనే లెక్కలు వేసుకునే.. ఆర్పీ ఠాకూర్ కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్ పని తీరు వివాదాస్పదంగా నిలిచింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత అనుకూలంగా వ్యవహరించారనే పేరును తెచ్చుకున్నారాయన. అంతే కాదు.. జగన్ మీద జరిగిన హత్యాయత్నం విషయంలో కూడా ఆర్పీ ఠాకూర్ స్పందించిన తీరు వివాదాస్పదంగా నిలిచింది.

అలా చంద్రబాబు మనిషిగా పేరు తెచ్చుకున్న ఠాకూర్ కు ఏపీలో చంద్రబాబు నాయుడి ఓటమి తప్పదని క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అందుకే ఆయన ముందే మకాం మార్చేస్తున్నారని .. ఏపీ సర్వీసు నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

కేవలం ఠాకూర్ మాత్రమే కాదని.. అడ్డగోలుగా చంద్రబాబుకు అనుకూలంగా పని చేసిన చాలా మంది పరిస్థితి ఇప్పుడు అదేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

ఠాకూర్ బదిలీకి దరఖాస్తు పెట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరాజయంపై మరింత స్పష్టత వచ్చిందనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.