Home రాజకీయాలు కొన్ని చోట్ల మరీ టీడీపీకి మూడో స్థానమేనా!

కొన్ని చోట్ల మరీ టీడీపీకి మూడో స్థానమేనా!

SHARE

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యేది మామూలు ఓటమి కాదనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో.. పోలింగ్ జరిగిన తీరుపై వినిపిస్తున్న విశ్లేషణల్లో చాలా వరకూ తెలుగుదేశం పార్టీ ఓటమినే అంచనా వేస్తూ ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడటం ఖరారే అని, టీడీపీ అభ్యర్థులు చాలా మంది చిత్తు కావడం ఖాయమని అనేక మంది అంచనా వేస్తూ ఉన్నారు. ఆ అంచనాలను తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రక్రియ మీద సందేహాలు వ్యక్తం చేస్తూ ఉండటం, జరిగినవి ఎన్నికలే కావని బాబు అంటూ ఉండటం.. తో తెలుగుదేశం పార్టీ కూడా తమ ఓటమిని నిర్ధారించుకుంటున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది.

ఇక ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమినే చవి చూడాల్సి ఉంటుందని.. కొన్ని చోట్ల తెలుగుదేశానికి మరీ మూడో స్థానమే దక్కుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉండటం విశేషం. గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి ఉందని వారు అంటున్నారు.

టీడీపీ చిత్తు కావడం అంటే మామూలుగా కాదు, గోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.

గోదావరి జిల్లాల్లో జగన్ కు స్పష్టమైన ఆదరణ కనిపించిందని, జగన్ వైపు అక్కడి ఓటర్లు మొగ్గు చూపారని.. పవన్ కల్యాణ్ కూడా కొంత వరకూ ఓట్లను చీల్చుకున్నారని.. దీంతో జనసేనకు రెండో స్థానం దక్కేలా ఉందని ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచిపోయే పరిస్థితి ఉందని వారు అంచనా వేస్తూ ఉన్నారు.

ఇక ఇంటెలిజెన్స్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన మరో సర్వే కూడా తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని అంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూటా ఇరవైకి పైగా స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని.. ఆ సర్వేలో తేలినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది!