Home సినిమా ఆ హాట్ సీన్లు తను చూడలేనంటున్న స్టార్ హీరో!

ఆ హాట్ సీన్లు తను చూడలేనంటున్న స్టార్ హీరో!

SHARE

ఈ రోజుల్లో సినిమాల్లో కిస్ సీన్లు చాలా కామన్. కిస్ సీన్లు అంటే.. అల్లాటప్పాగా కాదు.. తెరపై రొమాన్స్ హద్దులు దాటి చాలా కాలం అయ్యింది. మూతి ముద్దులు లేకుండా సినిమాలు రావడం లేదు. కొన్ని సినిమాల్లో కంటెంట్ ఏమీ ఉండదు. కేవలం హాట్ సీన్లే ఉంటాయి.

గతంలో అలాంటి సినిమాలు ప్రత్యేకంగా వచ్చేవి. అయితే ఇప్పుడు పాపులర్ అయిన నటీమణులు,నటులతోనే అడాల్ట్ కంటెంట్ సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలీవుడ్ తో మొదలుకుని ఈ ట్రెండ్ టాలీవుడ్ వరకూ పాకింది.

హారర్ జోనర్ అంటూ, యూత్ జోనర్ అంటూ.. హద్దుల్లేని సినిమాలే వస్తున్నాయి. జనాలు కూడా అలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేసేంత వరకూ వచ్చేశారు! సినిమాల్లో అవన్నీ మామూలే అని సర్ది చెప్పుకొంటూ ఉన్నారు.

అయితే తను అలా సర్దుకోలేన్నట్టుగా చెబుతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. సినిమాల్లో ముద్దు సీన్లకు శ్రుతి మించిన శృంగార సన్నివేశాలకు తను పూర్తి వ్యతిరేకం అని సల్లూ అంటున్నాడు. అలాంటి సీన్లు చూడటానికి చాలా ఆక్వర్డ్ గా ఉంటాయని.. ఆడియన్స్ కూడా వాటిని చూడటానికి అంత ఆసక్తి చూపరని సల్లూ అంటున్నాడు.

సినిమాలు చాలా క్లీన్ గా ఉండాలని..హద్దు మించిన శృంగార సన్నివేశాలు సరి కావని సల్మాన్ చెబుతుండటం గమనార్హం. మరి ఒకవైపు తన సన్నిహిత హీరోలు అలాంటి సినిమా్ల్లో నటిస్తూ ఉన్నా.. సల్మాన్ మాత్రం అలాంటి సినిమాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉండటం గమనార్హం!