Home రాజకీయాలు రఘువీరారెడ్డితో కుమ్మక్కు.. టీడీపీకి చావు దెబ్బ

రఘువీరారెడ్డితో కుమ్మక్కు.. టీడీపీకి చావు దెబ్బ

SHARE

– కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ గెలిచే అవకాశం

తెలుగుదేశం – కాంగ్రెస్‌ తెరవెనుక రాజకీయాలు చేస్తూ అక్కడక్కడా కొన్ని స్థానాల్లో ఒప్పందం ప్రకారం పోటీ చేసినట్లు బయటికి చెప్పకపోయినా ప్రజలందరు గమనించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీడీపీ నేతల నుంచే విమర్శలు వచ్చాయి. ఫలితంగా కళ్యాణదుర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరిని పక్కన పెట్టి ఉమామహేశ్వరనాయుడు డమ్మీ అభ్యర్థిగా టీడీపీ బరిలో దింపారు. అక్కడ కాంగ్రెస్‌ నుంచి రఘువీరారెడ్డి పోటీ చేస్తుండటమే కారణంగా చెప్పవచ్చు. ఈ కోణంలో టీడీపీ – కాంగ్రెస్‌ తెర వెనుక రాజకీయాలను గమనించిన ప్రజలు రెండు పార్టీలకు బుద్ధి చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ – టీడీపీ ఒప్పందంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే లాభం చేకూరినట్లు తెలుస్తోంది. ఫలితంగా రఘువీరారెడ్డి ప్రణాళిక మొత్తం విఫలం కానుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.

టీడీపీ – కాంగ్రెస్‌కు చావు దెబ్బ
కళ్యాణదుర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి టికెట్‌ ఇచ్చి ఉంటే పోటీ రసవత్తరంగా ఉండేదని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఉమామహేశ్వరనాయుడుకు టికెట్‌ ఇచ్చిన రోజునే నియోజకవర్గంలో టీడీపీ చావుదెబ్బ తిన్నట్లు చెబుతున్నారు. అయితే స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఎమ్మెల్యే ‘ఉన్నం’ పార్టీ అధిష్టానం సూచన మేరకు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఫలితంగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు టీడీపీ పరోక్షంగా సహకరిస్తోందనే ఉద్దేశంతో సొంత కార్యకర్తలు కూడా ఓటు వేసిన దాఖలాలు లేవు. ఫలితంగా వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేవీ ఉషాశ్రీచరణ్‌ నాలుగేళ్ల పాటు నిర్విరామంగా ప్రజలతో మమేకమయ్యారు. ప్రస్తుతం గెలుపు జాబితాలో ఉన్నారు.

కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు ఎంత?
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున రఘువీరారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హవా కారణంగా కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు శాతం ఎక్కువే. అంతేకానీ రఘువీరారెడ్డి సొంత ఓటు బ్యాంకు ఏమీ లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం కూడా కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డి పరిస్థితిలో మార్పు లేదు. వైఎస్సార్‌ ఓటర్లు ప్రస్తుతం జగన్‌ వెంట ఉన్నారు. ప్రత్యామ్నాయంగా టీడీపీ బలంగా ఉందని చెప్పవచ్చు. ఫలితంగా ఏ కోణంలో చూసినా రఘువీరారెడ్డి ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేట్లుకనిపించలేదు. అయితే టీడీపీకి మాత్రం చావుదెబ్బ పడేందుకు సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ రెండోస్థానంలో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్‌ మూడోస్థానంలోకి వెళ్లాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. టీడీపీ నేరుగా పోటీ చేసి ఉంటే హోరాహోరీ పోరు ఉండేదని టీడీపీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. ఈనేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేవీ ఉషశ్రీచరణ్‌ భారీ మెజారిటీతో విజయఢంకా మోగించే అవకాశం ఉంది.

ఉషాశ్రీచరణ్‌కు అనుకూలాంశాలు
– వైఎస్సార్‌సీపీ అధిష్టానం బీసీలకు పెద్దపీట వేయటం.
– కళ్యాణదుర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. అందులో కురుబ, బోయ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ.
– కళ్యాణదుర్గం సీటు కురుబ సామాజిక వర్గానికి.. అనంతపురం ఎంపీ సీటు బోయ సామాజిక వర్గానికి కేటాయించడంతో నియోజకవర్గ ప్రజలందరు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారు.
– టీడీపీ తరఫున రెండు స్థానాలకు ఓసీ కేటగిరి అభ్యర్థులే పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఉమామహేశ్వరనాయుడు, ఎంపీగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పోటీ చేశారు.
– ఫలితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబ, బోయ సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ వైఎస్సార్‌సీపీకే వచ్చినట్లు భావించవచ్చు.
– బీసీ సామాజిక వర్గానికి చెందిన రఘువీరారెడ్డి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్‌కు అంత సీన్‌ లేదని చెప్పవచ్చు.