Home సినిమా హీరోయిన్ కి, ఆమె తల్లికి వివాదం.. డబ్బు గొడవ!

హీరోయిన్ కి, ఆమె తల్లికి వివాదం.. డబ్బు గొడవ!

SHARE

ఇది వరకూ కూడా చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది వరకూ కూడా కొందరు హీరోయిన్లు డబ్బు విషయంలో తమ కెరీర్ విషయంలో తమ సొంత వాళ్లతోనే గొడవలు పడిన సందర్భాలున్నాయి.

చాలా మంది హీరోయిన్ల డబ్బును సొంత వాళ్లే దోచుకున్నారని, హీరోయిన్లు సంపాదించిన సొమ్ములను ఆత్మీయులు, తోబుట్టువులే దోచుకున్న సందర్భాలున్నాయని చాలా ఉదంతాలు వివరించి చెప్పాయి. అలాంటి విషయాలను సదరు హీరోయిన్లే బయటకు చెప్పుకున్నారూ కూడా.

అలా ఆత్మీయుల చేతుల్లో మోసపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు చేరినట్టుగా కనిపిస్తోంది సంగీత. తన తల్లే తనను మోసం చేసిందంటూ ఆమె అంటున్నారు.
తన చేత ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయించుకుని, తనను తన తల్లి దారుణంగా మోసం చేసిందని సంగీత చెబుతోంది. పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన నటీమణి ఈమె. ఇప్పుడు ఇలా తల్లి మీద ఆరోపణలు చేస్తోంది.

తనను తన తల్లి పదమూడో ఏట నుంచినే పని చేయించిందని, తన సోదరుడు, డ్రగ్స్ కు, మద్యానికి బానిస అని.. అతడి వ్యససానాల కోసం తను సంపాదించిన డబ్బును తన తల్లి వాడిందని.. తనను, తన భర్తను వేధించిందని, తను గొడవ చేసే వరకూ కూడా తన తల్లి తనకు పెళ్లి కూడా చేయలేదని సంగీత పేర్కొన్నారు. ఇది వరకూ పలువురు హీరోయిన్లు ఆర్థిక వ్యవహారాల విషయంలో సొంత కుటుంబీకులతోనే ఇలాంటి వివాదాలతో వార్తల్లోకి రాగా.. ఇప్పుడు సంగీత వచ్చింది.