Home రాజకీయాలు బాబు ఎవరికి ఓటేశారు.. ఇదే హాట్ టాపిక్!

బాబు ఎవరికి ఓటేశారు.. ఇదే హాట్ టాపిక్!

SHARE

ఈవీఎంలు వచ్చాకా కూడా.. తమ ఓటు ఎవరికి పడిందో ఓటర్లకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. తాము నొక్కిన బటన్ పక్కన లైట్ వెలగడంతోనే ఓటర్లకు అందుకు సంబంధించిన క్లారిటీ వస్తుంది. అంతే కాదు..ఈ సారి వీవీ ప్యాట్లు కూడా వచ్చాయి. తాము ఎవరికి ఓటు వేసిందీ.. వాటి ద్వారా అర్థం చేసుకోగలిగారు ఓటర్లు.

వాళ్లు ఎవరికి ఓటేసి ఉంటే..వారి సింబల్, పేరు తో సహా ఒక స్లిప్ వీవీ ప్యాట్స్ లో కనిపించింది. అది బయటకు రాకుండా..అలాగే బాక్స్ లోకి వెళ్లిపోయింది. తద్వారా ఎవరికి వారు తమ ఓటు ఎలా పడిందో అర్థం చేసుకోగలిగారు.

పరిస్థితి అంత క్లియర్ గా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తన ఓటు ఎవరికి పడింతో తనకే అర్థం కాలేదని వ్యాఖ్యానించడం ఒకింత ఆసక్తిదాయకంగా మారింది. సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ కు ఓటుపడిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తన ఓటు ఎవరికి పడిందో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించడం సిల్లీగా మారింది. ఓటు వేసిన వారందరూ వీవీ ప్యాట్స్ ను గమనించుకున్నారని..ఈవీఎంలో లైట్ పడటాన్ని బట్టి.. వారు అర్థం చేసుకున్నారని స్పష్టం అవుతూనే ఉంది.అయినా చంద్రబాబు నాయుడు తన ఓటు విషయంలో తనే అనుమానాలను వ్యక్తం చేయడం ద్వారా.. ఆయన ఓటు ఎవరికి ఓటేశారు? అనేది మిస్టరీగా మారిందనే అభిప్రాయాలకు అవకాశం ఇస్తోంది!