Home రాజకీయాలు టీడీపీ ఓటమిని ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు!

టీడీపీ ఓటమిని ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు!

SHARE

-పోలింగ్ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తున్న లీకులు,స్పీచ్ లు… ఏపీలో తెలుగుదేశం పార్టీ చిత్తు కావడం ఖాయమనే అభిప్రాయాలను కలిగిస్తూ ఉన్నాయి.

-వరసగా మూడో రోజు కూడా చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీదే తన కామెంట్లను చేశారు. పోలింగ్ రోజునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ పై అడ్డగోలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

-ఇక రెండో రోజు ‘ఇవి ఎన్నికలే కావు..’అని చంద్రబాబు నాయుడు తేల్చేశారు. తద్వారా తమ పార్టీ ఓడిపోతోందని, అందుకే బాబు అలా మాట్లాడుతూ ఉన్నారనే అభిప్రాయాలను కలిగించారు.

-ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం కూడా చంద్రబాబు నాయుడు అలానే మాట్లాడారు. తన ఓటు ఎవరికి పడింతో తెలీదని చెప్పుకొచ్చారు.

-ఆ విషయమే కాదు, పోలింగ్ రోజున ఈవీఎంలు ముప్పై శాతం వరకూ పని చేయలేదని చెప్పుకొచ్చారు. ఏకంగా ఎనభై శాతం మంది ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు ముప్పై శాతం ఈవీఎంలు పని చేయలేదని చెప్పుకురావడం పరమ విడ్డూరంగా మారింది.

-ఇక పదే పదే ఈవీఎంలను సంకిస్తున్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో ఈవీఎంలతోనే పోలింగ్ జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు. అయితే ఇప్పుడు మాత్రం ఈవీఎంలను ఆయన అనుమానిస్తూ ఉన్నారు.

-ఎలాగూ ఓటమి తప్పదనే చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారని, ఆయన మాటలను బట్టి ఏపీలో టీడీపీ చిత్తు అవుతుందనే విషయం స్పష్టం అవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

-ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మరీ కౌంటింగ్ రోజు వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదని..చంద్రబాబు నాయుడు మాటలను బట్టి.. ఏపీలో టీడీపీ చిత్తు కావడం ఖాయమనే అభిప్రాయానికి రావొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.