Home రాజకీయాలు బాబు కేబినెట్లోని మంత్రులంతా ఓడిపోతారా!

బాబు కేబినెట్లోని మంత్రులంతా ఓడిపోతారా!

SHARE

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు ముందుగా ప్రజా వ్యతిరేకతకు బలయ్యేది మంత్రి పదవుల్లో ఉండే వాళ్లే. మంత్రులుగా వ్యవహరించిన వాళ్లు వివిధ ఎన్నికల్లో ఓడిపోవడం జరుగుతూ వచ్చింది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగా ఉన్నప్పుడు మంత్రులు ఆడ్రస్ లేకుండా పోతారు ఎన్నికల ఫలితాల్లో. ఈ సారి ఏపీలో అదే జరగబోతోందని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఏపీలో మంత్రులంతా ఓడిపోతారు.. అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. బాబు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన వారిలో చాలా మందికి ఓడిపోయి తీరతారు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వాసంగా చెబుతున్నారు.

ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ-మంత్రులు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలాంటి వాళ్లకు భంగ పాటు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. వారు మాత్రమే కాదు.. ఫిరాయించి మంత్రి పదవులు పొందిన వాళ్లు, తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గి మంత్రులుగా వ్యవహరించిన వాళ్లు.. వీళ్లంతా జాయింటుగా ఓడిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదు.. వాస్తవంలో కూడా ఇలాంటి పరిస్థేతే ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగా ఉన్న నేపథ్యంలో బాబు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన వారిలో చాలా మందికి ఓటమి తప్పదనే అంచనాలే వ్యక్తం అవుతున్నాయి సర్వత్రా.