Home రాజకీయాలు పోలింగ్ అనంతరం.. టీడీపీలో నిర్వేదం, వైఎస్సార్సీపీలో జోష్!

పోలింగ్ అనంతరం.. టీడీపీలో నిర్వేదం, వైఎస్సార్సీపీలో జోష్!

SHARE

-ఏపీలో పోలింగ్ అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తూ ఉంది. భారీ స్థాయిలో నమోదు అయిన పోలింగ్ తమను విజేతగా నిలుపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు.

-భారీ స్థాయిలో నమోదు అయ్యే పోలింగ్ ఎప్పుడైనా అధికారంలో ఉండిన వారికి వ్యతిరేకమే అని ఏపీలో కూడా అదే జరుగుతూ ఉందని వారు విశ్లేషిస్తూ ఉన్నారు.

-ప్రజలు మార్పును కోరుకుంటున్న వైనం స్పష్టం అవుతోందని, చంద్రబాబునాయుడును ఇంటికి పంపించడానికి వారు రెడీగా ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

-చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రలోభాలు ఏవీ ప్రభావాన్ని చూపలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని, తమ పార్టీ నూటా ఇరవైకి పైగా స్థానాలను నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసం కనిపిస్తూ ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.

-ఇక తెలుగుదేశం వాళ్లు తమ లాజిక్కులు తాము చెబుతూ ఉన్నారు. మహిళలు భారీ ఎత్తున ఓటేశారనేది తెలుగుదేశం వాళ్లు చెబుతున్న లాజిక్.

-అయితే అన్ని వర్గాలూ ఓట్లు వేశాయని, ఎనభై శాతం ఓట్లు నమోదైనప్పుడు ఆడవాళ్ల ఓట్లు కూడా పోల్ కావడం సహనమే అనే విశ్లేషణలూ వినిపిస్తన్నాయి.

-ఇక తెలుగుదేశం అనుకూల మీడియా విషయానికి వస్తే ..వారు ఈసీని సాకుగా చూపుతున్నారు. ఈసీని తెలుగుదేశం పార్టీ కూడా నిందిస్తూ ఉంది. దీంతో..వాళ్లు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందని, అందుకే మరేం చేయలేక ఈసీని నిందిస్తున్నారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.