Home రాజకీయాలు అఖిలప్రియకు ఓటమి భయం? అందుకే అలా!

అఖిలప్రియకు ఓటమి భయం? అందుకే అలా!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కేబినెట్లో మంత్రులుగా ఉండిన పలువురు నేతలు ఈ సారి ఓడిపోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మంత్రుల్లో మెజారిటీ నేతలు ఓడిపోతారని.. అలా ఓడే వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, నారా లోకేష్ లు కూడా ఉంటారనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

వారి సంగతలా ఉంటే.. ఫిరాయింపు మంత్రి అఖిలప్రియకు కూడా ఓటమి భయం ఉందనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది. ఈ మేరకు ఆమె తీరే అందుకు ఉదాహరణ గా కనిపిస్తూ ఉంది. పోలింగ్ అనంతరం అఖిలప్రియ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆమె పోలీసుల మీద విరుచుకుపడ్డారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలం అయ్యారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఆమె ఫిర్యాదులు చేశారు.

అయినా అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలోకే ఈమె ఫిరాయించారు. మంత్రి పదవిని కూడా పొందారు. అధికారాన్ని చేతిలో పెట్టుకున్నారు. అంతజేసీ తీరా పోలింగ్ వేళ ఇలాంటి ఫిర్యాదులు చేయడం చోద్యంగా ఉందని పరిశీకులు అంటున్నారు.

ఈమెకు ఓటమి భయం మొదలైందని.. అందుకే ముందుగానే ఇలా మాట్లాడుతూ ఉన్నారని.. పోలింగ్ తీరును తప్పు పట్టే నేతలంతా ..ఓటమి భయంతో మాట్లాడుతున్నట్టే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.