Home రాజకీయాలు మాట్లాడితే మీనింగ్ ఉండాలి చంద్రబాబు గారూ..!

మాట్లాడితే మీనింగ్ ఉండాలి చంద్రబాబు గారూ..!

SHARE

ఒకవైపు ఏమో ఇవి ఎన్నికలే కాదు అని అంటున్నారు. మరో వైపు ఏమో తమ పార్టీ నూటా ముప్పై సీట్లు సాధించేస్తుందని చెప్పుకొస్తున్నారు! ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నట్టు? అసలు ఎన్నికలే కాని ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని చెప్పుకుంటారా? లేక ఎలాగూ ఓటమి తప్పదని ముందుగానే ఎన్నికల ప్రక్రియ సరిగా లేదని చెప్పుకొస్తున్నారా? ఈ విషయం చంద్రబాబు నాయుడు కే తెలియాలి.

అయితే చంద్రబాబు నాయుడు పూర్తిగా గందరగోళంలో ఉన్నారని మాత్రం స్పష్టం అవుతోంది. బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఎన్నికల కమిషన్ మీద ఇష్టానుసారం మాట్లాడి ఉండరు. గతంలో చాలా సార్లు ఎన్నికల కమిషన్లు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకుంటూ వచ్చాయి. గతంలోనూ డీజీపీల బదిలీలతో సహా అనేక మంది కీలకమైన అధికారుల బదిలీలు జరిగాయి.

అయితే అప్పుడంతా నాటి ముఖ్యమంత్రులు ఎవరూ ఇలా గగ్గోలు పెట్టలేదు. తమ పార్టీకి అన్యాయం జరిగిపోతోందని.. అధికారులను బదిలీ చేయవద్దని వారు వాపోలేదు.అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అదే పని చేస్తూ ఉన్నారు.

ఎన్నికల సమయంలో అంత వరకూ ఆయా రాష్ట్రాల్లో విధులు నిర్వహించిన చాలా మంది అధికార్ల బదిలీలు సాగుతూ ఉంటాయి. వాటి విషయంలో ఇది వరకటి ప్రభుత్వాలు చాలా హుందాగా స్పందించేవి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అక్కసుతో రగిలిపోయారు. తనకు చెంచాల్లా పని చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్న అధికారుల బదిలీలను చంద్రబాబు నాయుడు అస్సలు తట్టుకోలేకపోయారు.

పోలింగ్ కు ముందు కూడా చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడారు. పోలింగ్ తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా ఈసీ మీద చంద్రబాబు నాయుడు అసంబంద్ధమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. బాబు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు!