Home రాజకీయాలు పోలింగ్ వేళా విషం కక్కుతున్న పచ్చ మీడియా!

పోలింగ్ వేళా విషం కక్కుతున్న పచ్చ మీడియా!

SHARE

-పోలింగ్ వేళ కూడా పచ్చ మీడియా తన పనే తను చేస్తూ ఉంది. తప్పుడు రిపోర్టింగులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద రొటీన్ గా విషం కక్కుతూ ఉంది తెలుగుదేశం అనుకూల మీడియా.

-అనంతపురం జిల్లాలో గుంతకల్ జనసేన అభ్యర్థి కొట్రికే మధుసూదన్ గుప్తా ఒక ఈవీఎంను ధ్వసం చేశాడు. అది సరిగా పని చేయడం లేదంటూ ఆయన దాన్ని నేలకేసి కొట్టారు.

-జనసేన మార్కు ఓవరాక్షన్ చేశారాయన. ఈవీఎంను బద్ధలు కొట్టిన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత జరిగినా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈవీఎంను ధ్వంసం చేశాడని అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా రిపోర్టింగ్ చేస్తూ ఉండటం విశేషం.

-సమస్యాత్మక నియోజకవర్గాల్లో అలజడు రేగగా… అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా వార్తా కథనాలను ప్రసారం చేస్తూ ఉంది.

-ఈ జాడ్యం ఏమీ కొత్తది కాదు. పోలింగ్ రోజున కూడా తీరు మారడం లేదు. యథారీతిన రెచ్చిపోతూ ఉన్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.

-జమ్మలమడుగు, రాప్తాడు నియోజకవర్గాల్లో గొడవలు పతాక స్థాయికి చేరాయి. బూత్ క్యాప్చరింగ్ , రిగ్గింగులకు ప్రయత్నిస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలు.

-ప్రతిఘటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వారు రౌడీయిజం చెలాయిస్తూ ఉన్నారు. ఇక ఈవీఎంల మీద కూడా దుష్ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్లు.