Home ప్రత్యేకం ఏపీ ఎన్నికల్లో రాబోయే సంచలన ఫలితాలు అవే!

ఏపీ ఎన్నికల్లో రాబోయే సంచలన ఫలితాలు అవే!

SHARE

-ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. అయితే ఫలితాలు మాత్రం మే ఇరవై మూడున రానున్నాయి. విరామం చాలానే ఉంది.

-అయితే ఎప్పుడు ఫలితాలు వచ్చినా..ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే కొన్ని సంచలన ఫలితాలు రాబోయేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

-వివిధ సర్వేలు, అధ్యయనాలు చాలా ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతున్నాయి. అందులో సంచలనం అనదగ్గ స్థాయి విషయాలున్నాయి.

-ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఫుల్ గా ఉందని సర్వేయర్లు చెబుతూ ఉన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం ఖరారు అయ్యిందని, వేవ్ ను బట్టి అది 140 సీట్లలో విజయంగా మారవచ్చని కూడా అంటున్నారు.

-మెజారిటీల విషయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉండవచ్చని వారు చెబుతున్నారు.

-కొందరు ప్రముఖులు ఓడటం ఖాయమని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అందులో ముఖ్యుడు నారా లోకేష్. మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖరారు అని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కనీసం నాలుగు వేల ఓట్ల తేడాతో లోకేష్ ఓడిపోవచ్చని అంచనా.

-ఇక భీమవరంలో పవన్ కల్యాణ్ కు ఓటమి ఖరారు అనే మాట వినిపిస్తూ ఉంది. భీమవరంలో విజయం మీద పవన్ కల్యాణ్ కే నమ్మకం లేదు అని, ఆయన అక్కడ ఓటమికి ప్రిపేర్ అయ్యారనే అంచనాలున్నాయి.

-గాజువాకలో మాత్రం పవన్ కల్యాణ్ కు కొద్దో గొప్పో ఆశలున్నాయని, అయితే అక్కడ పోటీ టఫ్ గా ఉందని, పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతాడా? అనేది ఫలితాలు వస్తే కానీ తెలియదని పరిశీలకులు అంటున్నారు. ఆయన సోదరుడు నాగబాబు ఓటమి ఖాయమైనట్టే అని చెబుతున్నారు.

-కుప్పంలో చంద్రబాబుకు చాలా వరకూ మెజారిటీ తగ్గుతుందనే అంచనాలున్నాయి.

-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనిష్టంగా 110, గరిష్టంగా 140 సీట్ల వరకూ దక్కుతాయని, 20 కి పైగా ఎంపీ సీట్లతో కేంద్రంలో కూడా ఆ పార్టీ కీలక పాత్ర పోషించబోతోందని పోలింగ్ కు సమయం ఆసన్నం అయిన వేళ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.