Home ప్రత్యేకం దేశంలో అధికారం ఈ పార్టీలదే.. ఎన్డీటీవీ సర్వే!

దేశంలో అధికారం ఈ పార్టీలదే.. ఎన్డీటీవీ సర్వే!

SHARE

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభంజనం ఉంటుంది అంటోంది ఎన్డీటీవీ సర్వే. ఏపీతో సహా తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను కొన్ని ప్రాంతీయ పార్టీలు నెగ్గే అవకాశం ఉందని ఎన్డీటీవీ అంచనా వేసింది.

ఆ చానల్ అంచనాల ప్రకారం… ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉండనుంది. ఈ తెలుగు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని ఎన్డీటీవీ పేర్కొంది. పాతిక ఎంపీ సీట్లున్న ఏపీలో ఇరవై ఎంపీ సీట్లను జగన్ పార్టీ నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది.

ఈ నిష్పత్తిలో చూసుకుంటే.. ఏపీలో జగన్ పార్టీ నూటా నలభై ఎమ్మెల్యే సీట్లను సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అది రికార్డు స్థాయి విజయమే అవుతుంది.

ఏపీ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా అని అంచనా వేసిన ఈ జాతీయ మీడియా వర్గం.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి స్వీప్ చేస్తుందనే అంచనాలను వేసింది. అక్కడ ఆ పార్టీకి పదిహేను ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. కేవలం రెండు సీట్లను మాత్రమే అక్కడ వేరే పార్టీలు పొందుతాయని పేర్కొంది.

ఇక వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ ముప్పై ఎంపీ సీట్లను నెగ్గుతుందని, తమిళనాట డీఎంకే ఇరవై ఐదు ఎంపీ సీట్లను నెగ్గవచ్చని, ఒరిస్సాలో బీజేడీ పదహారు ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని ఎన్డీటీవీ అంచనా వేసింది.