Home సినిమా హీరోయిన్ ను హాట్ గా టచ్ చేశాడు, పెద్ద వివాదం!

హీరోయిన్ ను హాట్ గా టచ్ చేశాడు, పెద్ద వివాదం!

SHARE

ఒకవైపు బాలీవుడ్ లో మీ టూ రచ్చలు భారీ స్థాయిలో జరిగాయి. ఎప్పుడో దశాబ్దాల కిందటి వ్యవహారాలను కూడా కొంతమంది నటీమణులు తెర మీదకు తెస్తున్నారు. తమను ఫలానా నటుడు అసభ్యంగా తాకడని, తమతో అసహ్యంగా మాట్లాడాడు అని.. అనుచితంగా వ్యవహరించాడని అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన రచ్చలు కొనసాగుతూ ఉన్నాయి.

వాటి సంగతలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ లో మరో వివాదం రేగింది. ఇందులో సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ చిక్కుకున్నారు. ఒక ఫంక్షన్ వేదిక బయట మీడియాకు పోజులు ఇస్తున్న వేళ బోనీ కపూర్ నటి ఊర్వశీ రైటెల్లాను అసభ్యంగా తాకారు అనేది అభియోగం.

ఆమె బ్యాక్ ను తన చేత్తో కొట్టారు బోనీ కపూర్. ఈ విషయంలో ఆమె ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. అయితే అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో..ఊర్వశితో బోనీ కపూర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ప్రచారం ఊపందుకుంది. అందుకు సంబంధించి వీడియోపై అనేక కామెంట్లు మొదలయ్యాయి.

అయితే ఆ వీడియో వైరల్ అయ్యాకా ఊర్వశి స్పందించింది. అందులో తప్పేం లేదని ఆమె వాదిస్తోంది. బోనీ కపూర్ మంచి వాడని, గొప్ప మనిషి అని..ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని ఆమె చెబుతోంది. మరి స్వయంగా ఈ వ్యవహారంలో సదరు నటీమణే బోనీ కపూర్ కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తోంది. అయినా సోషల్ మీడియాలో మాత్రం బోనీ కపూర్ పై విమర్శల జడి కురుస్తూనే ఉంది.