Home సినిమా అందాలు ఆరేస్తున్న ఇషా.. అవకాశాలొస్తాయా!

అందాలు ఆరేస్తున్న ఇషా.. అవకాశాలొస్తాయా!

SHARE

తెలుగు సినీ పరిశ్రమ తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ఎంకరేజ్ చేయదనే పేరును కలిగి ఉంది. మనోళ్లకు ముంబై నుంచి దిగుమతి అయ్యే తారలంటేనే మక్కువ ఎక్కువ. ముంబై నుంచి హీరోయిన్లు దిగుమతి తగ్గిపోయి.. ఈ మధ్య కాలంతో కేరళ, తమిళనాడు నుంచి వచ్చే హీరోయిన్లు టాలీవుడ్ లో రాణిస్తున్నారు. గత పది, పదిహేనేళ్లుగా కేరళ, తమిళ భామల డ్యామినేషన్ తెలుగునాట కొనసాగుతూ ఉంది.

అప్పుడప్పుడు మాత్రం ఉత్తరాది నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకొంటూ ఉన్నారు. అంతే కానీ..తెలుగమ్మాయిలకు మాత్రం తెలుగుసినిమాల్లో అవకాశాలు దక్కవు. అప్పుడప్పుడు తెలుగమ్మాయిలు తమిళ, మలయాళ సినిమాల్లో అవకాశాలు పొంది రాణిస్తూ ఉంటారు. తమిళనాడులోనూ, కేరళలోనూ కొంతమంది తెలుగు హీరోయిన్లు మంచి గుర్తింపును పొందుతూ ఉంటారు. అయితే వారికి తెలుగునాట మాత్రం అవకాశాలు అంతంతమాత్రమే.

ఇదే కోవకు చెందిన నటీమణి ఇషా రెబ్బా. పేరులో తెలుగుదనం లేకపోయినా.. ఈ అమ్మాయి తెలుగమ్మాయే. పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.అయితే గ్లామరస్ గుర్తింపు మాత్రం ఇంకా దక్కలేదు. ఆ ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఉంది ఇషా. అందులో భాగంగా ఈ ఇలా హాట్ ఫొటో షూట్ లో దర్శనమిచ్చింది. క్లీవేజ్ అందాలను ఆరబోసింది. అందరి కన్నూ తన మీద పడేలా చేసుకుంటోంది.

మరి ఇలాంటి ఫొటో షూట్స్ తో ఇషాకు గ్లామరస్ గుర్తింపు వచ్చేనా.. ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కేనా.. వెయిట్ అండ్ సీ!