Home రాజకీయాలు రాధాకృష్ణ నువ్వొక లోఫర్, లఫూట్: పోసాని

రాధాకృష్ణ నువ్వొక లోఫర్, లఫూట్: పోసాని

SHARE

ఏబీఎన్- ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు దర్శకుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. తన పై ఆంధ్రజ్యోతిలో అనుచితమైన కథనాలను రాశారని, తప్పుడు వార్తలు రాశారని అంటూ.. ఆ పత్రిక యజమానిపై పోసాని తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వేమూరి రాధాకృష్ణను ‘లోఫర్.. లఫూట్’ అని కూడా అన్నారు పోసాని.

తనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిందంటూ, తను హాజరు కాలేదని, తప్పించుకు తిరుగుతున్నట్టుగా, తనపై ఈసీ చర్యలు కూడా తీసుకుంటుందన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందని పోసాని తెలిపారు. పూర్తి అబద్ధాలతో, తనపై తప్పుడు వార్తలను రాశారని ఆరోపిస్తూ.. పోసాని విరుచుకుపడ్డారు.

‘అక్షరం ఆయుధం అంటూ ఆంధ్రజ్యోతిని పెట్టిన రాధాకృష్ణ అంటే నాకు చాలా గౌరవం. అయితే ఆయన ఆ మాటకు కట్టుబడి లేడు. అక్షరాన్ని ఆయుధంగా కాకుండా.. ఒక వేశ్యలా చేశారు. అక్షరాన్ని అలా ఉపయోగించుకొంటూ ఉన్నారు. నాపై తప్పుడు కథనాలను రాశారు. తప్పుడు కథనాలు రాసినా భరించేందుకు నేనేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదు.

పోసాని కృష్ణ మురళిని, నాలో జెంటిల్ మ్యానే కాదు, డాబర్ మ్యాన్ కూడా ఉన్నాడు. నా లాంటి సామాన్యుడి జోలికి రావొద్దు. చంద్రబాబు నాయుడు సంక నాక దలుచుకుంటే ఆ పని చేయండి. చంద్రబాబు అరికాళ్లు నాకండి. నాకేం అభ్యంతరం లేదు.కానీ నా జోలికి ఎందుకు వస్తున్నారు? నా గురించి ఎందుకు తప్పుడు కథనాలను రాస్తున్నారు? రాధాకృష్ణ నువ్వొక లోఫర్, నువ్వొక లఫూట్…’ అని పోసాని వ్యాఖ్యానించారు.

అలాగే నామినేటెడ్ పోస్టుతో తనపై తప్పుడు మాటలు చెప్పడమే పని పెట్టుకున్నాడంటూ.. మరొక తెలుగుదేశం నేత మీద కూడా పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నీలాగా నేను లంగా కాదు. నామినేటెడ్ పోస్టు తీసుకుని చంద్రబాబు నాయుడు భజన చేయడం లేదు. నా సొంత కష్టంతో నేను ఎదిగాను. నేను సంపాదించిన పైనా నా కష్టం. నీ లాగా సంపాదించింది కాదు. చంద్రబాబు నాయుడుకు కుల పిచ్చి ఉందని నేను అన్నాను.

ఆ మాటకు ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దళితుల కుటుంబాల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అని ఏ ముఖ్యమంత్రి అయినా అంటారా? ఆ మాట జగన్ అని ఉంటే..ఆంధ్రజ్యోతి దానిపై సీరియల్ రాసేది కాదా? లోకేష్ బాబు తాగుబోతు, తిరుగుబోతు.. అలాంటి వాడు మీకు ఇష్టమైన వాడు. మీరు నా లాంటి కామన్ మ్యాన్ జోలికి రాకండి..’అని పోసాని ఫైర్ అయ్యారు.