Home రాజకీయాలు పవన్ కల్యాణ్ కు టీడీపీ వెయ్యి కోట్లు ఇచ్చింది!

పవన్ కల్యాణ్ కు టీడీపీ వెయ్యి కోట్లు ఇచ్చింది!

SHARE

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయల భారీ లంచాన్ని ఇచ్చారని ఆరోపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏపీలో పోటీ చేసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి జనసేన అధిపతికి ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి భారీ నిధి అందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ మేరకు ఆ పార్టీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ ఆరోపణను సంధించారు.

తెలుగుదేశం పార్టీ ఏపీలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ వ్యతిరేకతను ఎదుర్కొంటే నిండా మునిగే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడితే.. తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యే అవకాశం ఉంది. ద్విముఖ పోరులో తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పకపోవచ్చు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత కుటిల వ్యూహాన్ని రచించారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కల్యాణ్ ను డమ్మీ గా బరిలోకి దించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉన్న చోట.. తెలుగుదేశం పార్టీ వాళ్లు వ్యూహాత్మకంగా జనసేనను పోటీ చేయిస్తున్నారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తెలుగుదేశం పార్టీకి మేలు కలిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడా జనసేన గెలిచే అవకాశాలు లేవని, ఓట్లను అయితే పొందుతుందని.. ఓట్లను పొందినా ఆ పార్టీ నెగ్గే అవకాశాలు లేవని మాత్రం విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక జనసేన- టీడీపీలు లోపాయి కారీగా సహకరించుకుంటున్న వైనం కూడా వెలుగులోకి వస్తోంది. తెలుగుదేశం పార్టీకి అవసరం అయిన చోట పవన్ కల్యాణ్ సరిగా అభ్యర్థులను పెట్టడం లేదని, పవన్ కల్యాణ్ పోటీ చోట కూడా టీడీపీ సహకారం అందిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ప్రాధాన్యతను సంతరించుకుంది.