Home రాజకీయాలు టీడీపీ దుష్ప్రచారం.. వివేకానందరెడ్డి కూతురు ఆవేదన

టీడీపీ దుష్ప్రచారం.. వివేకానందరెడ్డి కూతురు ఆవేదన

SHARE

వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు చేస్తున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు వైఎస్ సునీత. తన తండ్రి హత్య విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. అనంతర పరిణామాలు తమను మరింతగా క్షోభకు గురి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డిని ఆయన కుటుంబీకులే హత్య చేయించారనే ప్రచారం మీద ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అలాంటి ప్రచారం ఎలా చేయాలని అనిపిస్తోంది… అని ఆమె ప్రశ్నించారు.

తమ కుటుంబీకులు ఒకరితో మరొకరు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని… హత్యలు చేసుకునే సంస్కృతి తమది కాదు అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో కొందరు పెద్దమనుషుల మాటలు బాధను కలిగిస్తున్నాయని సునీత వ్యాఖ్యానించారు.

ఈ కేసుపై చంద్రబాబు నాయుడు తన సొంత వ్యాఖ్యానం చేస్తున్న సంగతి తెలిసిందే. తనే విచారన అధికారాని, తనే ప్రత్యక్ష సాక్షి అయినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై బాబు దారుణమైన వ్యాఖ్యానం చేస్తున్నారు.

ఈ కేసులో పోలీసులు ప్రకటించని విషయాలను కూడా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నాడు. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాటలతో ఆయన రాజకీయ ప్రయోజనం పొందేప్రయత్నం చేస్తూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రయత్నాల పట్ల వైఎస్ వివేక కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వాళ్లకు, మీడియాకు ఆమె ఒకే విన్నపం చేశారు. తన తండ్రి హత్య విషయంలో దారుణ వ్యాఖ్యానాలు చేయవద్దని… ఈ కేసులో సిట్ విచారణ జరుగుతూ ఉందని..దాన్ని ప్రభావితం చేసేలా పెద్ద వాళ్ల మాటలు, మీడియా రాతలు ఉన్నాయని.. ఆమె వ్యాఖ్యానించారు. తీవ్రమైన ఆవేదన స్వరంతో ఈ హత్య కేసు పై తెలుగుదేశం వర్గాల దారుణ స్పందనలను ఆమె ఖండించారు.