Home రాజకీయాలు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కు 120 సీట్ల పైనే!

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కు 120 సీట్ల పైనే!

SHARE

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 130 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఏపీలో రాజకీయం గురించి తలసాని ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిదాయకంగా మారింది. ఏపీలో చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని మొదటి నుంచి చెబుతున్నారు ఈ తెలంగాణ రాజకీయ నేత. అంతే కాదు..ఏపీ రాజకీయంలో తను వేలు పెడతానని కూడా ఇది వరకే ఆయన హెచ్చరించారు కూడా.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తలసానిని తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంది. ఆయనను ఓడించడానికి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఏపీ నుంచి ప్రత్యేకంగా వెళ్లి తలసానిని ఓడించాలనే ప్రయత్నాలు సాగాయి. ఆ పరిణామాల అనంతరం తలసాని మాట్లాడుతూ..కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లో తను కూడా భాగస్వామిని అవుతానని ప్రకటించుకున్నారు.

ఏపీలోని బీసీలను కలుపుకుని చంద్రబాబును గద్దెదించే ప్రయత్నం సాగించడం ఖాయమని తలసాని ప్రకటించారు. అందుకోసం తను పని చేయడానికి కూడా రెడీ అని ప్రకటించారు తలసాని. ఇలాంటి నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు.

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తప్పదని తలసాని అంచనా వేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కు 120 నుంచి సీట్ల 130వరకూ వచ్చే అవకాశం ఉందని, ఎంపీ సీట్ల విషయానికి 22 లేదా 23 సీట్లను జగన్ పార్టీ ఖాయంగా నెగ్గుతుందని తలసాని అంచనా వేస్తున్నారు.