Home రాజకీయాలు లోకేశ్‌ను ఓడించి తీరుతాం! ఆ కులం హెచ్చరిక!

లోకేశ్‌ను ఓడించి తీరుతాం! ఆ కులం హెచ్చరిక!

SHARE

– అప్పట్లో చంద్రగిరి.. ఇప్పుడు మంగళగిరి
– ఓటమి తప్పదంటున్న రాజకీయ విశ్లేషకులు

మంగళగిరి నియోజకవర్గం రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైంది. ఈ నియోజకవర్గంలో వామపక్ష భావజాలం మెండుగా ఉంటుంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, సంస్థలు చాలా చురుకుగా వ్యవహరిస్తుంటాయి. అలాంటి చైతన్యవంతమైన మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు విజయం సాధించడం ఈ ప్రాంత రాజకీయ చైతన్యాన్ని తెలియజేస్తుంది.

మంగళగిరి విజేతలు వీరే..
1952 ఎన్నికల్లో దర్శి లక్ష్మయ్య (కమ్యూనిస్టు)
1955లో మేకా కోటిరెడ్డి (కాంగ్రెస్‌)
1962 ఎన్నికల్లో వేములపల్లి శ్రీకృష్ణ (కమ్యూనిస్టు)
1967 ఎన్నికల్లో తులాబంధుల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌)
1972 ఎన్నికల్లో వేములపల్లి శ్రీకృష్ణ (సీపీఐ)
1978 ఎన్నికల్లో జీవీ రత్తయ్య (జనతా)
1983, 1985 ఎన్నికల్లో డాక్టర్‌ ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు (తెలుగుదేశం)
1989 ఎన్నికల్లో గోలి వీరాంజనేయులు (కాంగ్రెస్‌)
1994 ఎన్నికల్లో నిమ్మగడ్డ రామ్మోహనరావు (సీపీఎం)
1999, 2004 ఎన్నికల్లో మురుగుడు హనుమంతరావు (కాంగ్రెస్‌)
2009 ఎన్నికల్లో కాండ్రు కమల (కాంగ్రెస్‌)
2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైఎస్సార్‌సీపీ) విజయం సాధించారు.

మంగళగిరి రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు మించి గెలుపొందిన వారు లేరంటే… ఎంతగా ఈ నియోజకవర్గం చైతన్యవంతమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించిన డాక్టర్‌ ఎంఎస్‌ఎస్‌ కు… కారణాలు ఏమైతేనేమీ 1989 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. అలాగే, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన మురుగుడు హనుమంతరావు తదుపరి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం రాలేదు. వీరిద్దరూ రాష్ట్ర మంత్రులుగా ఉంటూ కూడా తదుపరి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇక 2009 ఎన్నికల్లో గెలుపొందిన కాండ్రు కమల కూడా తదుపరి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే, 2014 ఎన్నికల్లో 12 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఓటమి పాలైన గంజి చిరంజీవి ( టీడీపీ) ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని అందుకోలేకపోయారు. ఆయన మున్సిపల్‌ చైర్మన్‌ గా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి (దాదాపు ఎమ్మెల్యే హోదా) గా ఉన్నప్పటికి పోటీ చేసే అవకాశం రాలేదు. ఇవన్నీ మంగళగిరి రాజకీయ చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.

అప్పటి నుంచి చేనేత వర్గాలే..
1989 ఎన్నికల నుంచి 2014 ఎన్నికల వరకు ప్రధాన రాజకీయ పార్టీల తరఫున మంగళగిరి నియోజకవర్గంలో అధికంగా ఉన్న చేనేతవర్గాల ప్రతినిధులే బరిలోకి దిగారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు చేనేత ప్రతినిధులకు సీటు ఇవ్వకపోవడం, అధికార టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్‌ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం వంటి కారణాలతో మరోసారి మంగళగిరి అంశం రాష్ట్రస్థాయిలో హాట్‌ టాపిక్‌ గా మారింది. ప్రధాన పార్టీల నుంచి చేనేతలకు ప్రాతినిధ్య కల్పించకపోవడంతో ఆ వర్గాల్లో తీవ్ర అసంతప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చేనేత వర్గీయులు ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశంపై రాజకీయ నేతలే కాకుండా పరిశీలకులు కూడా అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు.

పద్మశాలీలకు సంబంధించిన మంగళగిరి అసెంబ్లీ సీటును కబ్జా చేసిన నారా లోకేష్‌ను ఓడించి తీరుతామని రాష్ట్ర పద్మశాలి సంఘం తీర్మానించింది. ఆదివారం విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి 13 జిల్లాల నుంచి పద్మశాలీలు, ముఖ్యనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఎఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. పద్మశాలీలకు టికెట్ల కేటాయింపుల్లో అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం నుంచి తమ సామాజిక వర్గం ఆ పార్టీకి పల్లకీ మోసిందని.. అయితే నేడు ఆ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు.

9 శాతం ఉన్న మాకు ఒక్క సీటు ఇవ్వరా..
రాష్ట్ర జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న పద్మశాలీలకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని సమావేశంలో పద్మశాలి నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరి ప్రాంతంలో కొన్న భూములను కాపాడుకోవటానికే లోకేశ్‌ను అక్కడ పోటీలో దించి తమ కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలీలకు టికెట్‌ ఇచ్చిన పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నేతలు చినబాబు, రాధాకష్ణ, ఘంటశాల జగదీశ్, డాక్టర్‌ శారద, వి నాగరాజు, మురళీకష్ణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు.