Home ప్రత్యేకం గుంటూరు నుంచి పోటీ చేస్తోన్న హీరోయిన్ మాధవీలత

గుంటూరు నుంచి పోటీ చేస్తోన్న హీరోయిన్ మాధవీలత

SHARE

మరో మూడు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు నుంచి ఎన్నికల నామినేషన్ పర్వం మొదలైంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది ఉత్సాహం చూపుతుంటారు.  నాయకులే కాదు సినిమాల్లో నటించే వారికీ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటుంటారు.

చాలామంది టాలీవుడ్ నటులు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.  తాజాగా, ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ చేరిపోయింది. నచ్చావులే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మాధవీలత.. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది.  రీసెంట్ గా టాలీవుడ్ క్యాస్టింగ్ విధానంపై ఘాటు వ్యాఖ్యలు చేసి అందరిని ఆకర్షించింది.  ఆ తరువాత బీజేపీలో చేరింది.  ఇప్పుడు ఆమెకు గుంటూరు పశ్చిమ టికెట్ ను కేటాయించారు. రాజకీయాలకు కేంద్రబిందువైన గుంటూరులో ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజక వర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండేవిధంగా కనిపిస్తోంది.  అన్నిపార్టీలు ఈ నియోజక వర్గంపైనే దృష్టి సారించి ప్రచారం చేస్తున్నాయి.