Home సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29 న..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29 న..?

SHARE

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎవరు అడ్డుకోవడం ఎవరి తరం కాదని చెప్పిన వర్మ.. అవసరమైతే చట్టపరంగా కూడా అప్రోచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో వర్మ ఈ సినిమా విషయంలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో అర్ధం అవుతున్నది. ఎన్నికలకు ముందే సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయాలని వర్మ పట్టుదలతో ఉన్నాడు.  అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నాడు వర్మ.

సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించుకున్న వర్మ ఈ సినిమాను బుధవారం రోజున సినిమాను సెన్సార్ క్లియరెన్స్ కు పంపించనున్నారు.  క్లియర్ అయ్యి వస్తే.. సినిమాను రిలీజ్ చేస్తారట.  సెన్సార్ చేసి మార్చి 22 న రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి సినిమాను మార్చి 29 కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను మార్చి 29 వ తేదీన రిలీజ్ చేసి తీరుతా అంటున్నాడు వర్మ.