Home ప్రత్యేకం వైఎస్ వివేకానందరెడ్డి ది దారుణ హత్య.. వారిపై అనుమానం

వైఎస్ వివేకానందరెడ్డి ది దారుణ హత్య.. వారిపై అనుమానం

SHARE

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కడప మాజీ ఎంపీ, పులివెందుల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారని వార్తలు వచ్చాయి. పోస్టు మార్గం నివేదిక అనంతరం.. ఆయనది దారుణ హత్యగా స్పష్టం అవుతూ ఉంది.

అగంతకులు ఆయనను నరికి చంపి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయనది హత్య అని మాత్రం పోస్టు మార్గం నివేధిక ధ్రువీకరించింది. నిన్నంతా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వివేకానందరెడ్డి రాత్రి ఒంటరిగానే ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేఫథ్యంలో ఆయనపై దాడి జరిగిందని, దొడ్డి ద్వారా అగంతుకులు ప్రవేశించి ఆయనను చంపేశారని వెల్లడి అవుతోంది. ఈ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల వేళ వివేకానందరెడ్డి మరణం సంచలనం రేపుతూ ఉంది.

జమ్మలమడుగు హత్యా రాజకీయమే వివేకానందరెడ్డిని బలితీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి స్థానికుల నుంచి. జమ్మలమడుగులో విజయాన్ని అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి కి జగన్ ఆ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు.

జమ్మలమడుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను వివేకకు అప్పగించారు జగన్. ఆ పనుల్లో ఆయన తనమునకలై ఉన్నారు కూడా. ఇలాంటి నేపథ్యంలో ఆయన హత్య జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జమ్మలమడుగులో హత్యా రాజకీయాలు కొత్త కాదు. ఇలాంటి నేపథ్యంలో.. ఆ రాజకీయమే వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేయించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.