Home రాజకీయాలు జగన్ పై పచ్చ బ్యాచ్ పాచి కుట్రలు..!

జగన్ పై పచ్చ బ్యాచ్ పాచి కుట్రలు..!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద పచ్చ బ్యాచ్ మళ్లీ పాత కుట్రలే చేస్తూ ఉంది. పాచి పోయిన నోళ్లతో మళ్లీ పాత పాటలే పాడుతూ ఉంది. ఎన్నికల వేళ మళ్లీ జగన్ పై పాత పేపర్లనే తిప్పి తిప్పి రాస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. ఇదీ గత రెండు రోజుల పరిణామాల మీద ఏపీలో వినిపిస్తున్న కామెంట్.

తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గత ఎన్నికల ముందు జగన్ విషయంలో ఎలాంటి కథనాలను రాసిందో.. నిస్సిగ్గుగా మళ్లీ వాటినే తిరగ రాస్తూ ఉండటం విశేషం. అయితే ఈ సారి సొల్లు ఏమిటంటే.. జగన్ కు మోడీ సహకరిస్తూ ఉన్నాడు అనేది.

మోడీ తో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నాడని, మోడీకి జగన్ లంచం ఇచ్చాడని.. ఇలా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. మోడీకి జగన్ లంచం ఇచ్చాడనే మాట వింటే జనాలు నవ్వుకుంటారనే భయం ఏదీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లలో కనిపించకపోవడం విశేషం.

తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆ రేంజ్లో కామెడీ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో బీజేపీ- తెలుగుదేశం పార్టీలు కలిసే పోటీ చేశాయి కదా, నాలుగున్నరేళ్ల పాటు మోడీతో తెలుగుదేశం సన్నిహిత సంబంధాలే నడిపించింది కదా, అప్పుడంతా ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు? ఇక ఆ సమయం అంతా.. మోడీని తెలుగుదేశం పార్టీ ఏ రేంజ్లో మోసిందో అందరికీ తెలిసిందే.

మోడీతో సాన్నిహిత్యం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టింది. ప్రత్యేక హోదా విషయంలో కూడా మోసపూరిత వైఖరిని అనుసరించింది. ఇవన్నీ ఎవరికి తెలియనివి ఏమీ కాదు. అయితే ఎన్నికల వేళ మోడీని బూచి చూపి బయటపడాలని తెలుగుదేశం ప్రయత్నిస్తూ ఉందని స్పష్టం అవుతోంది. అందుకే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు జగన్ మీద పాచి కథనాలు… వాటికి మోడీతో, కేసీఆర్ తో ముడి వేసి ప్రయోజనాలు పొందాలని చూస్తూ ఉన్నారు!

అయితే ఏపీ ప్రజలకు ఇప్పటికీ టీడీపీ మీద ఒక అభిప్రాయం అయితే వచ్చేసిందని వేరే చెప్పనక్కర్లేదు ఇలాంటి తరుణంలో పచ్చ కుట్రలు చిత్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.