Home రాజకీయాలు లోకేష్.. అలా జరిగితే, పొలిటికల్ కెరీరే క్లోజ్?!

లోకేష్.. అలా జరిగితే, పొలిటికల్ కెరీరే క్లోజ్?!

SHARE

ఎట్టకేలకూ నారా లోకేష్ పోటీ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకుందట. ఇప్పటి వరకూ లోకేష్ పోటీ విషయంలో పలు నియోజకవర్గాల పేర్లను లీకులుగా ఇచ్చినా.. చివరకు మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నట్టుగా తాజా లీక్ ఇచ్చారు. అక్కడ నుంచి లోకేష్ పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టే అంటున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ పోటీ విషయంలో చాలా నియోజకవర్గాల పేర్లను వినిపించి.. ఆ తర్వాత మాటలు మార్చినా.. ఇప్పుడు మాత్రం ఖరారు చేయాల్సిన టైమ్ వచ్చింది.

మంగళగిరి నుంచి లోకేష్ పోటీ అని అంటున్నారు. మరి ఆ నియోజకవర్గంలో లోకేష్ గెలుపు కేక్ వాక్ కాదు అనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది.

గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పన్నెండు ఓట్ల తేడాతోనే అయినా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. కాబట్టి.. వైసీపీకి నియోజకవర్గంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉందని స్పష్టం అవుతోంది.

ఇదే సమయంలో.. అక్కడ ఈ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలు చేరికలు జరిగాయి. వారిలో కొందరు బలమైన నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ ఉత్సాహవంతంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతకు అయితే కొదవలేదు. లోకేష్ నాన్ లోకల్ అనే అంశంపై కూడా చర్చ సాగే అవకాశం ఉంది.

ఏదేమైనా లోకేష్ కఠినమైన పరీక్షను ఎదుర్కొనబోతున్నాడని స్పష్టం అవుతోంది. మొదటి సారి ఏదో సిల్లీగా నామినేట్ అయిన ఈయన ఎమ్మెల్యేగా నెగ్గలేకపోతే మాత్రం.. పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది!