Home రాజకీయాలు లోకేష్ అభ్యర్థులను డిసైడ్ చేస్తున్నారు! టీడీపీలో కలకలం!

లోకేష్ అభ్యర్థులను డిసైడ్ చేస్తున్నారు! టీడీపీలో కలకలం!

SHARE

పార్టీ కోసం పనిచేసిన నాయకులు, సీనియర్లు, సమర్థులను పక్కన పెట్టేస్తూ ఏకపక్షంగా టిక్కెట్లు ఖరారు చేస్తుండడం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ ఆశీస్సులు ఉంటే చాలు సమర్థత, పార్టీ కోసం చేసిన సేవతో నిమిత్తం లేకుండా టిక్కెట్లు దక్కుతున్నాయని అంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుండటంతో అకస్మాత్తుగా కొత్త ముఖాలకు పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు. క్యాష్‌ కొట్టు.. టికెట్‌ పట్టు.. అన్న చందంగా టీడీపీ నాయకుల పరిస్థితి తయారైంది. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన వారు.. పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి.. అత్యధిక ధనవంతులకే టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ నేతృత్వంలో టికెట్ల కేటాయింపు జరుగుతోందని సమాచారం. ఫలితంగా టీడీపీలోని పలువురు సీనియర్‌ నాయకులు నారా లోకేశ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేతల పనితీరు, సర్వేల ప్రకారమే టిక్కెట్లు ఇస్తామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. కానీ, అదంతా ఉత్తదే, చినబాబుకు డబ్బు మూటలు సమర్పిస్తేనే టిక్కెట్లు కేటాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇలాగే కొనసాగితే పార్టీ పుట్టి మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుతో సహా సీనియర్లు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటుండటం చర్చనీయాంశంగా మారింది.

లోకేశ్‌ ఒంటెత్తు పోకడ
సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ టిక్కెట్ల కేటాయింపులో ఒంటెత్తు పోకడతో ముందుకు పోతున్నారని టీడీపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌నాయకులు, కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజుకు సమాచారం లేకుండానే కాంగ్రెస్‌ నేత కిశోర్‌చంద్రదేవ్‌కు టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు. ఆయనకు అరకు ఎంపీ టిక్కెట్‌ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. దీంతో అశోక్‌గజపతిని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం రాజాం (ఎస్సీ రిజర్వుడు) లో కూడా ఆయన మాట చెల్లుబాటు కాలేదు. గత ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాని కోండ్రు మురళీని టీడీపీలో చేర్చుకునేందుకు, రాజాం అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు లోకేశ్‌ అనుమతి ఇవ్వడంసై అసమనం వ్యక్తం చేస్తున్నారు.

డబ్బు మూటలే ప్రధానం..
టీడీపీలో టిక్కెట్ల కేటాయింపులో డబ్బు మూటలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనే విమర్వలు లేకపోలేదు. సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌కు కూడా మంత్రి లోకేశ్‌ దెబ్బ తగిలింది. ఓ బడా కాంట్రాక్టర్‌ రాజమండ్రి ఎంపీ టిక్కెట్‌ కోసం మంత్రి లోకేశ్‌తో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు రాజకీయాల్లో లేని ఆయన రాజమండ్రి నుంచి బరిలో దిగేందుకు భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు టీడీపీ వర్గాలే వెల్లడించాయి. ఫలితంగా మురళీమోహన్‌కు ఈసారి టిక్కెట్‌ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతాలు పంపారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న సీనియర్లు లింగారెడ్డి, వరదరాజులరెడ్డికి మంత్రి లోకేశ్‌ గట్టిగానే షాక్‌ ఇచ్చారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనూహ్యంగా ప్రొద్దుటూరు రేసులోకి రావడం చర్చనీయంగా మారింది. ప్రొద్దుటూరు టిక్కెట్‌ను వీరశివారెడ్డికి ఖాయం చేయాలని టీడీపీ నిర్ణయించడంపై లింగారెడ్డి, వరదరాజులరెడ్డి భగ్గుమంటున్నారు. ఇక మైదుకూరు టిక్కెట్‌ను డీఎల్‌ రవీంద్రారెడ్డికి కేటాస్తామని సీఎం చంద్రబాబు కొన్ని నెలల క్రితం హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం éజాగా టీడీడీ చైర్మన్‌ పుట్ట సుధాకర్‌యాదవ్‌ను మంత్రి నారా లోకేశ్‌ తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దీనికి అంగీకరించాల్సి వచ్చింది. పార్టీలో సీనియారిటీ, చిత్తశుద్ధి, సమర్థతలను పట్టించుకోకుండా డబ్బు మూటలు ముట్టజెబుతున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.