Home రాజకీయాలు లీకుః పవన్ కల్యాణ్ పోటీ.. అక్కడ నుంచినేనట!

లీకుః పవన్ కల్యాణ్ పోటీ.. అక్కడ నుంచినేనట!

SHARE

లీకు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని తీసిపోవడం లేదు జనసేన కూడా. జనసేన రాజకీయం కూడా లీకుల మయం అయిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ విషయంలోనే జనసేన అధికారిక ప్రకటనలు ఏవీ చేయడం లేదు. కేవలం లీకులు మాత్రమే ఇస్తూ ఉన్నారు.

పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది మొదటి నుంచి సందేహంగా నిలిచిన అంశమే. ఈ విషయంలో జనసేన అధిపతి కొన్నాళ్ల కిందట మాట్లాడుతూ.. తను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాడు. అనంతపురం జిల్లా అంటే తనకు అమితమైన ప్రేమ అని.. అందుకే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టుగా ప్రచారం చేశారు.

మీడియా కూడా అదిగో.. తోక అంటే.. మిగతాది అల్లేస్తుంది కాబట్టి… పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా కదిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టుగా ప్రచారం చేసి పెట్టింది. అయితే.. అంతా ఉత్తిదే అని తేలిపోయింది. అనంతపురం నుంచి పోటీ చేయడం లేదు పవన్ కల్యాణ్. ఈ విషయం పై చాన్నాళ్ల కిందటే క్లారిటీ వచ్చింది.

ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి.వచ్చే వారంలో నామినేషన్లు దాఖలు చేయాలి.ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చాల్సి ఉంది. అదేమీ తేలడం లేదు కానీ.. ప్రస్తుతానికి అయితే లీకు ఇచ్చారు. పవన్ కల్యాణ్ గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని జనసేన లీకు ఇచ్చింది.

అయితే ఇంకా అధికారికం కాదు. ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. జనసేన వర్గాలు ఈ విషయంపై వ్యాఖ్యానించడం లేదు. గాజువాక నుంచి పవన్ పోటీని మాత్రం ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. మరి అసలు కథ ఏమిటో.. వచ్చే వారంలో కానీ తెలియదు!