Home రాజకీయాలు పచ్చ ముసుగులు తొలగుతూ ఉన్నాయ్!

పచ్చ ముసుగులు తొలగుతూ ఉన్నాయ్!

SHARE

తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పని చేసిన వారి ముసుగులు తొలగుతూ ఉన్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే అని తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలోకి చేరి.. లక్ష్మినారాయణ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తూ ఉంది.

ఈయన తెలుగుదేశం పార్టీలోకి చేరడం వల్ల ఆ పార్టీ ఏ మేరకు బలోపేతం అవుతుందనే సంగతిని పక్కన పెడితే.. ఒక విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి అని తేటతెల్లం అవుతుంది. జగన్ పై కేసులు నమోదు చేయడంలో, తప్పుడు అభియోగాలు మోపడంలో కుట్ర ఏమిటో స్పష్టం అవుతుంది.

ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు అయ్యి.. జగన్ పై కేసులు నమోదు చేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తూ ఉన్నారు. ఈ మేరకు అనేక ఆధారాలను కూడా చూపారు. జగన్ పై కోర్టుకు ఫిర్యాదు చేసిందే తెలుగుదేశం పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలు కలిసి.. అనేది కూడా అందరికీ తెలిసిందే.

కేవలం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో నాటి సీబీఐ ఏపీ విభాగానికి జేడీగా ఉండిన లక్ష్మినారాయణ కేసులు నమోదు చేయడమే తప్ప.. జగన్ ఎలాంటి తప్పు చేయలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. మాజీ సీఎస్ లు కూడా అదే మాటే చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే.. అసలు కథ అందరికీ అర్థం అయిపోయినట్టే. ఆయన నిజాయితీ ఏపాటితో అర్థం అయిపోయినట్టే. పచ్చ ముసుగు తొలగినట్టే!
చంద్రబాబు కుట్రతో , కాంగ్రెస్ డైరెక్షన్లో లక్ష్మినారాయణ జగన్ పై కేసులు నమోదు చేశాడని, తప్పుడు అభియోగాలు మోపాడని.. ఇప్పుడు అందుకు ప్రతిఫలంగా తెలుగుదేశం పార్టీ నుంచి పదవులు పొందుతూ ఉన్నాడని స్పష్టం అవుతుంది. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలాంశం!