Home రాజకీయాలు లేటెస్ట్ సర్వే.. ఏపీలో వైఎస్సార్సీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ!

లేటెస్ట్ సర్వే.. ఏపీలో వైఎస్సార్సీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ!

SHARE

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అంటోంది ఇండియాటుడే సర్వే. మామూలు విజయం కాదు.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించబోయేది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని ఆ సర్వే అంటోంది. ఎంపీ సీట్ల వారీగా జరిగిన ఆ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీ సీట్లను సాధించుకునే అవకాశం ఉందని ఇండియాటుడే అంచనా వేసింది.

తెలుగుదేశం పార్టీ కేవలం మూడు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని ఆ జాతీయ మీడియా సర్వే సంస్థ అంచనా వేసింది. గతంలో కూడా ఇండియాటుడే ఇదే తరహా సర్వేను ఇచ్చింది.

కొన్ని రోజుల క్రితం ఇండియాటుడే ఏపీలో పరిస్థితి గురించి అంచనా వేస్తూ..జగన్ కు నలభై ఎనిమిది శాతం మంది మద్దతు ఉందని పేర్కొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ముప్పై ఆరు శాతం మంది మద్దతు మాత్రమే ఉందని విశ్లేషించింది. ఇప్పుడు తాజా సర్వేను సీట్ల వారీగా చేసింది ఇండియాటుడే.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయాన్ని సాధించడం ఖాయమని… 22 ఎంపీ సీట్లు అని ఈ అధ్యయనం అంటోంది.

ఇక సీ వోటర్ సర్వే కూడా వెల్లడి అయిన సంగతి తెలిసిందే. అయితే సీ ఓటర్ సర్వేలకు విశ్వసనీయత లేదు. ఆ సంస్థ సర్వేలు ఏవీ ఇప్పటి వరకూ నిజం అయిన దాఖలాలు లేవు.