Home రాజకీయాలు దేవినేని ఉమకు ఝలక్.. సొంత తమ్ముడు వైసీపీలోకి!

దేవినేని ఉమకు ఝలక్.. సొంత తమ్ముడు వైసీపీలోకి!

SHARE

మాటెత్తితే జగన్ మీద విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్న మంత్రి దేవినేని ఉమకు గట్టి ఝలక్ తగిలింది. ఆయనకు స్వయానా తమ్ముడు దేవినేని చంద్రశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మైలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో దేవినేని చంద్రశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సోదరుడిని విమర్శించారు. నీటి పారుదల శాఖా మంత్రిగా దేవినేని ఉమ తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని చంద్రశేఖర్ అన్నారు. ఆ అవినీతి వ్యవహారాల నుంచి ఉమ తప్పించుకోలేరని, ఆయన శిక్షను అనుభవించాల్సి ఉంటుందని దేవినేని చంద్రశేఖర్ తన సోదరుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మైలవరంలో దేవినేని ఉమకు వ్యతిరేక గాలి వీస్తోందని కొన్నాళ్లుగా గట్టి ప్రచారమే జరుగుతూ ఉంది. ప్రత్యేకించి నియోజకవర్గం ఇన్ చార్జి బాధ్యతలను వసంత కృష్ణ ప్రసాద్ తీసుకున్నాకా.. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది.

వసంత వర్గాన్ని అణిచి వేయడానికి దేవినేని ఉమ వివిధ మార్గాలను ఉపయోగించుకొంటూ ఉన్నారు. అయినా ప్రయోజనం లేదని.. ఈ సారి ఉమకు ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు మంత్రి ఉమ సోదరుడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి.. మంత్రిని విమర్శించడంతో.. నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఇక ఈ రోజు నటుడు అలీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎలాంటి షరతు లేకుండా తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టుగా అలీ ప్రకటించారు.