Home రాజకీయాలు ట్విస్ట్‌.. వైసీపీలోకి నటుడు అలీ?

ట్విస్ట్‌.. వైసీపీలోకి నటుడు అలీ?

SHARE

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రెండు నెలల క్రితం ఎయిర్‌పోర్టులో జగన్, అలీ కలుసుకోవడంతో అప్పటి నుంచి అలీ వైసీపీకి వెళ్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని ఖండిస్తూ.. వైసీపీలో చేరుతున్నానని ఎవరు చెప్పారంటూ వ్యాఖ్యానించిన ఆలీ.. ఆ తర్వాత ఒకే రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లను కలిశారు. అలీ ప్రత్యక్ష రాజకీయాల్లో రంగప్రవేశానికి వైసీపీనే సరైన వేదిక అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో పార్టీ అధినేత జగన్ సమక్షంలో అలీ వైసీపీ సభ్యత్వం స్వీకరించనున్నారు.

జగన్ సోమవారం నాడు కాకినాడలో సమర శంఖారావం సభకు వెళ్లాల్సి ఉండడంతో, ఉదయమే అలీ పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలీని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం జగన్ కాకినాడ పయనం అవుతారు. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో కూడా అలీ స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఐతే.. ఎట్టకేలకు ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే, వైసీపీలో చేరుతున్న అలీ ఎక్కడ నుంచి పోటీచేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.