Home సినిమా కేన్సర్ తో బాధపడుతున్న అభిమానిని వెళ్లి కలిసిన వెంకీ

కేన్సర్ తో బాధపడుతున్న అభిమానిని వెళ్లి కలిసిన వెంకీ

SHARE

ప్రముఖ నటుడు వెంకటేశ్ ప్రచార ఆర్భాటాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. తన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా.. ఒకవేళ డిజాస్టర్ అయినా కానీ పొంగిపోవడాలు.. కృంగిపోవడాలూ కనిపించవు. ఇటీవల ‘ఎఫ్2’తో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ, ఇటీవలే అక్కినేని నాగ చైతన్యతో కలిసి మరో మల్టీ స్టారర్‌ను ప్రారంభించారు. పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

తాజాగా వెంకీ త‌నను చూడాల‌నుకుంటున్న అభిమాని కోరిక‌ను తీర్చాడు. ఎల్బీ నగర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సురేష్‌ కోసం ఆయన ఇంటికి వెళ్లి కలిసాడు వెంకీ. సురేశ్ బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. వెంకీ తాజాగా అతనిని కలిసి ధైర్యం చెప్పి.. కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన అభిమాని పట్ల వెంకీ చూపిన చొరవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.