Home ప్రత్యేకం వైఎస్ జగన్ .. మిస్టర్ కూల్..!

వైఎస్ జగన్ .. మిస్టర్ కూల్..!

SHARE

ఒకవైపు చంద్రబాబు నాయుడు తన అసహనాన్ని అంతా చాటుకొంటూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు నోరేసుకుని పడిపోతూ ఉన్నారు. ఒక అనామక ఐటీ కంపెనీపై పోలీసులు దాడి జరిగాయంటేనే చంద్రబాబు నాయుడు సహించలేకపోయారు. ప్రతి దానికీ గగ్గోలు పెట్టడం చంద్రబాబుకు అలవాటు అయిపోయింది. ఉదయం లేస్తే.. మోడీ.. కేసీఆర్..జగన్ అంనడమే చంద్రబాబుకు పని అయిపోయింది.

ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటే అదే నిజం అయిపోతుంది అనేది చంద్రబాబు నాయుడి లెక్కగా కనిపిస్తూ ఉంది. అందుకే.. ప్రతి రోజూ అదే మాటే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ప్రశాంతంత లేకుండా కనిపిస్తూ ఉన్నాడు. అంతే కాకుండా..జగన్ అసహనంతో ఉన్నాడు.. అంటూ చంద్రబాబు నాయుడు వాపోతూ ఉన్నారు.

అయితే ఇలా మాట్లాడుతుండటాన్ని చూస్తూ ఉంటే..అసలు అసహనం ఏమిటో ప్రజలందరికీ అర్థం అవుతూ ఉంది. బాబు ఇలా అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం చాలా కూల్ గా కనిపిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా లండన్ వెళ్లొచ్చారు, కూతురును చూసొచ్చారు, ఆ తర్వాత తాపీగా పార్టీలోకి వస్తున్న వారికి జగన్ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు.

ఈ విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూల్ గా కనిపిస్తున్నారు. హాట్ సమ్మర్లో కూడా జగన్ ప్రశాంతంగా ఉన్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా జగన్ మరీ హైరానా చేయడం లేదు. సమీక్షలు అంటూ హడావుడి చేయడం లేదు. గ్రూపులను పిలుచుకుని మాట్లాడటం, వారి మధ్యన పంచాయతీలు చేయడం.. వంటివి జగన్ చేయడం లేదు.

చేసే పని ని కూల్ గా చేసుకొంటూ పోతున్నారు. జగన్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అంతుకే కూల్ గా ఉన్నాడు. అయితే బాబుకు మాత్రం ఆ విశ్వాసం లేదు. అందుకే అలా అసహనంతో రగిలిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.