Home సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మరో వీడియో సాంగ్‌ రిలీజ్

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మరో వీడియో సాంగ్‌ రిలీజ్

SHARE

దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్. ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే తనదైన స్టైల్ సినిమాను ప్రమోట్ చేస్తున్న వర్మ తాజాగా రెండో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు.

అవసరం అవసరం అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ విజయాలు సాధించినప్పుడు ఆయన వెంట నడిచిన కుటుంబం, బంధువులు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఒంటరిని చేశారో ప్రస్తావించాడు. అయితే పాట మొత్తం సినిమాలోని పాత్రధారులను మాత్రమే చూపించిన చంద్రబాబు ను మాత్రం డైరెక్ట్‌గా చూపించాడు. వెన్నుపోటు పొడిచిన బాబు, ఎన్టీఆర్‌ పోయాక దండవేసి దండం పెడుతున్నాడని చురకలంటించాడు.