Home సినిమా అదృష్టం అంటే రష్మికదే..!!

అదృష్టం అంటే రష్మికదే..!!

SHARE

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక… రెండో సినిమా గీతగోవిందం తో వంద కోట్ల క్లబ్ లో చేరింది. తన ఆటిట్యూడ్ నటనతో ఆకట్టుకుంది.  ఈ సినిమా తరువాత దేవదాస్ చేసిన పెద్దగా ఫలితం లేదు.  కాప్ రోల్ తో మెప్పించింది.  కాగా, ఇప్పుడు తన మూడో సినిమాతో మరో ఫీట్ ను సొంతం చేసుకోబోతున్నది.

సూపర్‌ స్టార్ మహేష్ బాబు చేయబోయే తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్‌ గా ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్‌… నెక్ట్స్ యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.