Home సినిమా అఖిల్ కి జోడీగా ప్రియాంక జవాల్కర్?

అఖిల్ కి జోడీగా ప్రియాంక జవాల్కర్?

SHARE

తెలుగు తెరకి ‘టాక్సీవాలా’ చిత్రం ద్వారా ప్రియాంక జవాల్కర్ పరిచయమైంది. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ పరంగా ఈ సినిమాలో ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మాయి వరుస అవకాశాలను అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ అమ్మడు స్పీడ్ చూపించలేదు.

ఈ నేపథ్యంలో, రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘డిస్కో రాజా’ సినిమాలో ప్రియాంకకి ఛాన్స్ దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిల్ నాల్గొవ సినిమాలోను చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక కోసం ప్రియాంక జవాల్కర్ ను సంప్రదిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో అమ్మడి కెరియర్ ఆగకుండా పరుగులు పెడుతుందేమో చూడాలి.