Home ట్రైలర్స్ లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ట్రైలర్‌: ఒకేఒక తప్పు వాడిని నమ్మడం

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ట్రైలర్‌: ఒకేఒక తప్పు వాడిని నమ్మడం

SHARE

లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్. ఈ సినిమా ట్రైలర్‌ గురువారం రిలీజ్‌ అయింది.  నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’ అంటూ ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్‌లో స్పష్టంగా చూపించాడు వర్మ. ఇక ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన నిమిషాల్లోనే దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం.