Home ట్రైలర్స్ మజిలీ టీజర్‌

మజిలీ టీజర్‌

SHARE

అక్కినేని నాగచైతన్య, తన రీల్, రియల్‌ లైఫ్‌ జోడి సమంతతో కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ‘దేర్‌ ఈజ్‌ లవ్‌.. దేర్‌ ఈజ్‌ పెయిన్‌’ అనేది ఉపశీర్షిక. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఇందులో నీకో సంవ‌త్స‌రం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం. ఒక్కసారి పోతే తిరిగి రావు అది వస్తువైనా, అమ్మాయైనా అని రావు ర‌మేష్ చెప్పే డైలాగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది.

పోసాని చివర్లో వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరకుకుతారంటూ  చెప్పే డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఇక చిత్రంలో ప‌లు స‌న్నివేశాలు కూడా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ. వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.