Home వీడియోలు అప్పుడు కన్నుకొట్టి.. ఇప్పుడు లిప్ లాక్..!!

అప్పుడు కన్నుకొట్టి.. ఇప్పుడు లిప్ లాక్..!!

SHARE

ప్రియా వారియర్.. సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు.  గూగుల్ లో ప్రియా కోసం విపరీతంగా సెర్చ్ చేశారు.  ఇంతకీ ఆమె చేసింది ఏంటి అంటే జస్ట్ కన్ను కొట్టడమే.  కన్ను కొట్టి యువతను బుట్టలోపడేసింది.  సినిమా రిలీజ్ కాకముందే.. చిన్న టీజర్ తో ఎక్కడికో వెళ్ళిపోయింది.

ఈ సినిమాను తెలుగులో లవర్స్ డే పేరుతో డబ్బింగ్ చేసి ప్రేమికుల రోజున రిలీజ్ చేయబోతున్నారు.  సినిమా రిలీజ్ కు ముందు ఓ చిన్న టీజర్ ను రిలీజ్ చేశారు.  అందులో కాలేజీ గోడకు ఆనుకొని.. ప్రియా ప్రకాష్ కు హీరో లిప్ టు లిప్ కిస్ చేస్తాడు.  చిన్న టీజర్.. సోషల్ మీడియాలో మరోమారు సంచలనంగా మారింది.  అప్పుడు కన్నుకొట్టి సంచలనం సృష్టించిన ప్రియా.. లిప్ లాక్ తో మరోమారు ట్రెండింగ్ లోకి వచ్చింది.  దాదాపు కోటిమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు అంటే అర్ధం చేసుకోవచ్చు.