Home రాజకీయాలు ఆ టికెట్లపై తేల్చేసిన చంద్రబాబునాయుడు!

ఆ టికెట్లపై తేల్చేసిన చంద్రబాబునాయుడు!

SHARE

ఎట్టకేలకూ తెలుగుదేశం పార్టీలో జమ్మలమడుగు పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రామసుబ్బారెడ్డి, కడప ఎంపీ గా ఆదినారాయణ రెడ్డిని పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారట. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎన్ని సమావేశాలు నిర్వహించాడో అందరికీ తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రచ్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు అది ఎట్టకేలకూ తేలింది.

ఈ వ్యవహారం ఖరారు అయ్యిందనడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వారిద్దరి చేతా ప్రకటనలు చేయించారు కూడా. తద్వారా వారి అభ్యర్థిత్వాలు ఖరారు అయినట్టుగా తేల్చి చెప్పారు.

ఇక అసలు కథ మిగిలి ఉంది. అదే ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి- రామసుబ్బారెడ్డిలు సహకరించుకోవడం. వీరిద్దరూ ఒకరి విజయానికి మరొకరు సహకరించుకుంటారా?అనేది ప్రశ్నార్థకమే.

అసలుకు కడప ఎంపీగా పోటీ చేయడం ఆదినారాయణ రెడ్డికి ఇష్టంలేదు. అది ఎలాగూ తెలుగుదేశం గెలిచే సీటు కాదనేది అందరికీ తెలిసిందే. అందుకే కడప ఎంపీగా పోటీ చేస్తే ఓటమి ఖాయం కాబట్టి.. అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని చంద్రబాబు ముందు ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశాడు. దీంతో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి పోరాడుకోవాలి.. ఎంపీ టికెట్ పొందిన వ్యక్తి ఎలాగూ ఓడిపోతాడు కాబట్టి.. ఎమ్మెల్సీ పదవి దక్కాలి.. ఇదీ వీళ్ల ఒప్పందం! ఎలాగూ ఓడిపోతాం అన్నట్టుగా వీళ్ల ఒప్పందం భలే కామెడీగా ఉంది!