Home సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో హీరోయిన్ గా నభా నటేష్..!!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో హీరోయిన్ గా నభా నటేష్..!!

SHARE

టాలీవుడ్‌లో హీరోయిన్‌ నభా నటేష్‌ మంచి ఫామ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ కన్నడ బ్యూటీకి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. రవితేజ హీరోగా నటించనున్న ‘డిస్కోరాజా’ సినిమాలో ఒక హీరోయిన్‌గా నభా నటేష్‌ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇది వార్తల్లో ఉండగానే.. నభా మరో అవకాశం కొట్టేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ ఇస్మార్ట్ శంకర్’లో ఓ నాయికగా నభా నటేష్‌ని తీసుకున్నారు..

ఈ విషయాన్ని నిర్మాతలు చార్మీ, పూరి జగన్నాథ్‌ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ ఎంపిక అయ్యారు. ‘‘కిర్రాక్‌ హైదరాబాద్‌ పోరీ నభా నటేష్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు’’ అని చార్మీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ దాదాపు 40 రోజులు సాగుతుందని సమాచారం. రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ చిత్రం లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఈ చిత్రం మేలో విడుదల కానుంది.