Home రాజకీయాలు చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా?

చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా?

SHARE

సోషల్‌ మీడియాలో తన పట్ల, కుటుంబ సభ్యుల పట్ల పుకార్లు పుట్టిస్తున్నది టీడీపీ నేతలే అని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా అని ఆమె ప్రశ్నించారు. తనపై వస్తున్న పుకార్లపై సోమవారం షర్మిళ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన భర్త అనిల్‌కుమార్, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మలతో సీపీని కలిసిన షర్మిళ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టించడం భావ్యం కాదన్నారు.

ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు పనే అన్నారు. గతంలో కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అని, వైయస్‌ జగన్‌ కోపిష్టిఅని చంద్రబాబు ప్రచారం చేశారని అవన్నీ తప్పు అని వైయస్‌ జగన్‌ పాదయాత్రలో స్పష్టమైందన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక చంద్రబాబు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల చులకనాభావంతో రాస్తున్న రాతలను సమాజం సమర్ధించదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను అరికట్టాలని సీపీని కోరినట్లు చెప్పారు. నా గౌరవం కాపాడుకునేందుకు మీడియా మందుకు వచ్చానని చెప్పారు. తనకు ఎలాంటి సంబంధాలు లేవని తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పారు. ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్న వారు కూడా తమ పిల్లలపై ప్రమాణం చేసి చెబుతారా అని నిలదీశారు.

వైయస్‌ షర్మిలా ప్రెస్ మీట్ పూర్తి వివ‌రాలు ఇలా..
అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల మండిపడ్డారు. ఒక మహిళ అనే గౌరవం లేకుండా తెలుగుదేశం పార్టీ నాపై దుష్ప్రచారం చేస్తుందన్నారు.2014 ఎన్నికలకు ముందు దుష్ప్రచారం ఆన్‌లైన్‌లో ఒక క్యాంపెయిన్‌లా ఒక వర్గం నడిపిందన్నారు. మళ్లీ ఎన్నికల నేపథ్యంలో విషప్రచారానికి వేగం పెంచారని ధ్వ‌జ‌మెత్తారు. ఒక మహిళ పట్ల ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలు, విష ప్రచారం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.